చైనా లో సైతం సత్తా చాటిన భారత సంతతి వ్యక్తి       2018-07-07   00:56:27  IST  Bhanu C

ఈ మధ్య భారతీయులు విదేశాలలో భారతీయుల సత్తా చాటుతున్నారు..వరుసగా ఎదో ఒక విజయాలు విదేశాలలో భారతీయల పేరు మీద నమోదు అవుతూనే ఉన్నాయి..అంతేకాదు…ఎంతో చారిత్రాత్మమైన కీలక విషయాలలో కానీ పదవులలో గానీ భారతీయులని నియమిస్తూ ఎంతో గౌరవాన్ని ఇస్తున్నారు..అయితే ఎప్పడు భారతీయుల ప్రతిభకి పట్టం కట్టే విషయంలో అమెరికా పేరు ఎక్కువగా వినిపిస్తే ఈ సారి భారత ప్రతిభకి పట్టం కట్టిన లిస్టు లో చైనా కూడా చేరింది… వివరాలలోకి వెళ్తే..

భారత సంతతికి చెందినా వ్యక్తి అయిన దీపక్ జైన్ గత కొన్నేళ్లుగా చైనాలోనే ఉంటున్నారు…అయితే ఎంతో ప్రతిభ కలిగిన దీపక్ జైన్ ని షాంఘైలోని ప్రఖ్యాత చైనా యూరప్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్కూల్‌ (సీఈఐబీఎస్‌) యూరోపియన్‌ అధ్యక్షడిగా నియమించారు..అయితే గతంలో ఈ పదవిలో ఉన్న పెడ్రో న్యూనో స్థానంలో దీపక్ జైన్ ఎంపిక కాబడ్డారు..

ఇదిలాఉంటే ఆయన ఇంతకు ముందు కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌సీయడ్‌ స్కూళ్లకు డీన్‌గా వ్యవహరించారు. ఇక నుంచి సీఈఐబీఎస్‌లో చైనా అధ్యక్షుడు లీ మింగ్జన్‌తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. షికాగోలో నివసిస్తున్న దీపక్‌ జైన్‌ గతేడాది సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెల 10 నుంచి 15 రోజులు సీఈఐబీఎస్‌లో మార్కెంటిగ్‌పై తరగతులు బోధించారు.