ప్రభుత్వ సంరక్షణలో పిల్లలు... స్వదేశానికి తీసుకెళ్లేందుకు భారతీయ జంట న్యాయపోరాటం

బ్రిటన్‌లో ఓ భారతీయ జంట ఓ అరుదైన న్యాయపోరాటాన్ని చేస్తోంది.ఫోస్టర్ కేర్ విధానంలో ప్రభుత్వ సంరక్షణలో వున్నతమ పిల్లల జాతీయతను మార్చవద్దని, వారిని తమతో పాటు భారతదేశానికి పంపించాలని కోరుతున్నారు.

 Indian Parents Plead For Return Of Children From Foster Care In Uk, Indian Paren-TeluguStop.com

బ్రిటన్‌లో ప్రభుత్వ సంరక్షణలో వున్న ఇద్దరు మైనర్ పిల్లలను తీసుకుని భారతదేశంలో నివసించడానికి అనుమతించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.తమిళనాడులోని నాగపట్నానికి చెందిన ఈ జంట 2004లో యూకేకు వెళ్లారు.వీరికి 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు.2015లో పిల్లలిద్దరిని బర్మింగ్‌హామ్‌లోని స్థానిక పిల్లల సంరక్షణ కేంద్రంలో ఉంచారు.అప్పటి నుంచి వారితో ఎలాంటి కాంటాక్ట్ లేదు.

వీరికి బ్రిటీష్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే ముందు కోర్టు అనుమతి పొందాలని గత వారం బర్మింగ్‌హామ్ చిల్డ్రన్ ట్రస్ట్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

తాను భారత జాతీయుడినని, పిల్లలు కూడా భారతీయ పౌరులేనని, తాము స్వదేశానికి వెళ్లడానికి ఇష్టపడతామని, వారికి బ్రిటిష్ పౌరసత్వం వద్దని బర్మింగ్‌హామ్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తండ్రి స్పష్టం చేశాడు.బర్మింగ్‌హామ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సీజీఐ) వీరి నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటంలో ఈ దంపతులకు న్యాయ సహాయం అందిస్తోంది.

పిల్లల అవసరాలకు సాయం అందించాలని, వారికి భారతీయ పాస్‌పోర్టులు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని భారత కాన్సులేట్‌ కోరుకుంటున్నట్లు వీరు బర్మింగ్‌హోమ్‌లోని ఫ్యామిలీ కోర్టుకు తెలియజేశారు.అలాగే ప్రయాణ ఖర్చులతో పాటు భారత్‌లో పిల్లల సంరక్షణకు నిధులు సమకూరుస్తామని సీజీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Telugu Foster Care, Indian, Indianplead, Uk-

మరోవైపు ఈ కేసును యూకే కోర్ట్ ఆఫ్ అప్పీల్ ‘ అందరికీ సవాల్ ’’గా అభివర్ణించింది.ఈ పిల్లల తండ్రి తరపున భారతీయ న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టు ఎదుట వాదనలు వినిపించారు.కాగా పిల్లలను వారి తల్లిదండ్రుల సంరక్షణ నుంచి తొలగించడం వెనుక గల కారణాలు కోర్టులో వెల్లడించలేదు.అయితే గతేడాది డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం… మైనర్ పిల్లలు వారి బాల్యంలో ప్రభుత్వ సంరక్షణలో ఉండాలని తెలిపింది.

తన పిల్లలను యూకే ప్రభుత్వ సంరక్షణ నుంచి విడుదల చేసి, తమతో లేదా తమ బంధువులతో భారతదేశానికి పంపించాలన్నదే తన ఏకైక ఉద్దేశ్యమని తండ్రి స్పష్టం చేశారు.
తమిళనాడుకే చెందిన అతని భార్య ప్రస్తుతం సింగపూర్‌లో తన తల్లి, మరో కుమార్తెతో కలిసి నివసిస్తోంది.

గర్భవతిగా ఉన్నప్పుడు మూడో బిడ్డను సైతం కోల్పోతానేమోనన్న భయంతో ఆమె యూకే విడిచి సింగపూర్‌లో ప్రసవించింది.తాను మూడవ బిడ్డను బాగా పట్టించుకోలేదా.? అధికారుల ఆరోపణలు అబద్ధమని సదరు పిల్లల తల్లి ఆరోపించారు.వారు తన పిల్లలను తన నుంచి వేరు చేశారని.

ఏం జరుగుతోందో తాను అర్ధం చేసుకోలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయస్థానంలో ఆమెకు ఢిల్లీకి చెందిన న్యాయవాది నందితా రావు సహాయం చేశారు.

ఫోస్టర్ కేర్ విధానం (యూకే పౌరులు కానీ) లో పిల్లల జాతీయతను కాపాడటానికి బర్మింగ్‌హామ్ అధికారం, సామర్ధ్యాన్ని అంచనా వేయాలని నందితా రావు అన్నారు.తల్లిదండ్రులు లేక అనాథాశ్రమాల్లో, ప్రభుత్వ ఆశ్రమాల్లో నివసిస్తున్న చిన్నారులను కొంతకాలం వరకు ఇంటికి తెచ్చుకుని పెంచుకోవచ్చు.

ఈ విధానాన్నే ఫోస్టర్ కేర్ విధానం అంటారు.వారి వారి ఆర్ధిక స్థోమతను బట్టి నచ్చినన్ని రోజులు చిన్నారులను పెంచుకోవచ్చు.

తర్వాత చిన్నారులను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube