వ్యాక్సిన్ కోసం అమెరికా చదువు: మారుతున్న భారతీయ తల్లిదండ్రుల ఆలోచన

చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.

 Indian Parents Are Sending Their Children To American Universities For A Shot At Getting Covid 19 Vaccine-TeluguStop.com

నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.

భారతీయులకు సైతం ఫేవరెట్ డెస్టినేషన్ అమెరికాయే.అయితే కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అగ్రరాజ్యానికి పంపడానికి భయపడ్డారు.

 Indian Parents Are Sending Their Children To American Universities For A Shot At Getting Covid 19 Vaccine-వ్యాక్సిన్ కోసం అమెరికా చదువు: మారుతున్న భారతీయ తల్లిదండ్రుల ఆలోచన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు పరిస్ధితులు చక్కబడుతుండటంతో అమెరికా ప్రయాణాలు మళ్లీ ఊపందుకున్నాయి.మనదేశంలోని పేరెంట్స్ ఇప్పుడు రెండు కారణాలతో తమ పిల్లలను అమెరికాకు పంపుతున్నారు.

వీటిలో ఒకటి చదువు కోసమైతే.రెండోది కరోనా వ్యాక్సిన్.

ఇందుకు కారణం లేకపోలేదు.దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కొవాగ్జిన్‌లను అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.దీనిలో భాగంగా జనవరి 16 నుంచి దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తొలి విడతలో డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, సైన్యం, సాయుధ బలగాలు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు.

ఆ తర్వాత మార్చి 1 నుంచి మొదలైన రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు.వీరితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందిస్తున్నారు.

అయితే దేశంలో 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి వ్యాక్సినేషన్ ఇంకా మొదలుకాలేదు.ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో తల్లిదండ్రులు తమ బిడ్డల ఆరోగ్యంపై ఆందోళనకు గురవుతున్నారు.

దీనిలో భాగంగానే వారిని అమెరికాకు పంపితే.చదువుతో పాటు వ్యాక్సిన్ కూడా వేయించవచ్చని పేరెంట్స్ భావిస్తున్నారు.

Telugu America, Connecticut State Website, Corona Vaccine, Kovaggin, Kovshield-Telugu NRI

అమెరికాలోని కొన్ని కాలేజీల్లో విదేశీ విద్యార్ధులు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి అర్హులు.అలాగే యూకేలోనూ హై రిస్క్ గ్రూపులలోని వ్యక్తులు వయస్సుతో సంబంధం లేకుండా టీకాలు పొందుతున్నారు.అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి మొదట ఏ గ్రూపుకు టీకాలు వేయాలో నిర్ణయించే స్వంత ప్రణాళిక వుంది.అదే సమయంలో ఏప్రిల్ 19 నుంచి వయోజనులందరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

ప్రస్తుతం అగ్రరాజ్యంలోని అలాస్కా, అలబామా రాష్ట్రాల్లో 16 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడానికి అర్హులే.అలాగే కనెక్టికట్ రాష్ట్ర వెబ్‌సైట్ ప్రకారం.ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో నివసించే, పనిచేసే, పాఠశాల, కళాశాలలకు హాజరయ్యే 16 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులే.మరోవైపు భారతీయ విద్యార్ధులు మొగ్గుచూపే దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సైతం వేసవిలో విద్యార్ధులకు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

#Corona Vaccine #America #Kovaggin #Kovshield

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు