ఇదీ లక్కంటే...ఉద్యోగం కోల్పోయిన భారతీయుడికి ఊహించని జాక్ పాట్..!!!

అదృష్టం ఇది కొంత మందికి మాత్రమే సొంతం.కొందరికి వచ్చినా ఉపయోగించుకోలేరు, మరో కొందరికి వచ్చినట్టే వచ్చి చే జారిపోతోంది.

 Indian Origin Won Lottery Dubai-TeluguStop.com

ఎక్కడో ఎవరికో సుడి గిర్రున తిరిగితే వాడు నన్ను వదిలిపోవే అన్నా బంకలా పట్టుకునే ఉంటుంది. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఊహించలేం.

చేతిలో చిల్లి గవ్వలేక, ఉద్యోగం కోల్పోయి, భార్యా పిల్లలు కళ్ళ ముందు కనపడి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఏదన్నా పని దొరికితే బాగుండు అనుకునే వాడికి ఆకసం నుంచీ డబ్బు మూట వచ్చి చేతిలో పడితే ఎలా ఉంటుంది చెప్పండి.అవును అచ్చం అలాంటి అనుభవమే ఎదుర్కున్నాడు దేశం కాని దేశంలో ఓ భారతీయుడు.

 Indian Origin Won Lottery Dubai-ఇదీ లక్కంటే…ఉద్యోగం కోల్పోయిన భారతీయుడికి ఊహించని జాక్ పాట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళనాడుకు చెందిన నజీర్ అలీ అనే వ్యక్తి తన కుటుంభంతో కలిసి దుబాయ్ లో ఉంటున్నాడు.అక్కడే చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు.

అయితే కరోన సమయంలో అతడికి ఉద్యోగం పోయింది.ఏదన్న పనిలో చేరాలన్న ఉద్యోగాలు లేని పరిస్థితి.

పైగా తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నాడు.ఉద్యోగం కోసం వేట సాగిస్తూనే మరో పక్క తన స్నేహితుడితో కలిసి మహాజూజ్ లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితే

చేతిలో డబ్బులు అయిపోతున్న టెన్షన్ ఒకవైపు, చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు కుటుంభాన్ని ఎలా పోషించుకోవాలనే టెన్షన్ మరొక వైపు నజీర్ అలీ లో ఎక్కవైపోయింది.ఈ క్రమంలోనే తన స్నేహితుడు అలీ కలిసి కొన్న టిక్కెట్టు లాటరీలో గెలుచుకుందని తెలుసుకుని ఒక్క సారిగా ఎగిరిగంతేశాడు నజీర్ అలీ.వాళ్ళు కొన్న టిక్కెట్టు కు రెండవ బహుమతి దక్కిందట దాని విలువ అక్షరాలా 1 మిలియన్ దిర్హమ్స్.అంటే మూడు కోట్ల కు పైగా.

అయితే ఇద్దరు చెరిసగం పంచుకోగా నజీర్ అలీ వాటాకు రూ.కోటికి పైగా డబ్బులు వచ్చాయి.దేవుడు తన కష్టాలు తీర్చాడని, పిల్లకు మంచి చదువు చెప్పించి, ఎన్నో ఏళ్ళుగా హోటల్ పెట్టాలనే కలను నెరవేర్చుకుంటానని అలీ తెలిపాడు.ఇది కదా అదృష్టం అంటే…

.

#Lottery Dubai #IndianOrigin #Crores #Dheerams #Indian Origin

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు