ఎన్ఆర్ఐ మహిళ చిత్రహింసలు.. ఆకలితో ప్రాణాలు విడిచిన పనిమనిషి

మనదగ్గర పనిచేసే వారికి కూడు, గూడు, గుడ్డ అందించడంతో పాటు ఆపదలో ఆదుకున్న యజమానులను ఎంతోమందిని చూశాం.పనివాళ్లకు ఇళ్లు కూడా ఇళ్లు కట్టించిన వారిని చూశాం.

 Indian Origin Woman Tortures Maid Death Singapore-TeluguStop.com

కానీ ఓ భారతీయ మహిళ పనిమనిషిని చిత్రహింసలు గురిచేసి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది.వివరాల్లోకి వెళితే.

సింగపూర్‌లో స్థిరపడిన గాయత్రి మురుగయాన్ అనే భారత సంతతికి చెందిన మహిళ ఇంట్లో మయన్మార్‌కు చెందిన పియాంగ్ (40) అనే మహిళ పనిచేస్తోంది.ఆమె ఇటీవల మెదడుకు గాయమై ప్రాణాలు కోల్పోయింది.

 Indian Origin Woman Tortures Maid Death Singapore-ఎన్ఆర్ఐ మహిళ చిత్రహింసలు.. ఆకలితో ప్రాణాలు విడిచిన పనిమనిషి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆమెను తీవ్రంగా హింసించడం, కొట్టడం, తిండిపెట్టకపోవడం కారణంగానే పియాంగ్ మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలు చెబుతున్నాయి.మృతురాలి శరీరంపై 50కు పైగా గాయాలు ఉన్నట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి.గాయత్రి .పియాంగ్‌కు కనీసం భోజనం కూడా పెట్టకుండా ఆమెను చిత్రహింసలు పెడుతూ వచ్చినట్టు తేలింది.పియాంగ్‌తో వెట్టిచాకిరీ చేయించుకుని, ఆమెకు తిండి పెట్టకుండా గాయత్రి నరకం చూపించింది.

అంతేకాకుండా తనకు తెలియకుండా ఆమె ఎక్కడ భోజనం చేస్తుందేమోనని పియాంగ్‌ను కిటికీకి కట్టేసి రాక్షసానందం పొందింది.ఈ నేపథ్యంలో పియాంగ్ మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు విడిచింది.

చివరికి ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కూడా ఆ స్థితిలో కన్నీటికి గురయ్యారంటే గాయత్రి ఏ స్థాయిలో వేధించిందో అర్ధం చేసుకోవచ్చు.

మరోవైపు తిండి పెట్టకపోవడం వల్ల పియాంగ్ బాగా కృశించిపోయింది.మరణించే సమయానికి ఆమె బరువు కేవలం 24 కేజీలే అని డాక్టర్లు తెలిపారు.ఒకవేళ మెదడుకు గాయం కాకపోయినా శరీరంలో పోషక స్థితి క్షీణించడం వల్ల పియాంగ్ కొద్దిరోజుల్లోనే మరణించి ఉండేదని డాక్టర్లు వెల్లడించారు.

ఈ కేసులో పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకుని పలు అభియోగాలు మోపారు.విచారణలో భాగంగా పియాంగ్‌పై దాడి చేసింది తానేనని, ఆమె మరణానికి కారణం తానేనంటూ గాయత్రి కోర్టులో నేరాన్ని అంగీకరించింది.

ఈ నేరానికి గాను ఆమెకు జీవితఖైదు విధించే అవకాశముంది.

#Singapore #Maid Death #IndianOrigin #Court #Myanmarese

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు