బ్రిటన్‌లో భారత సంతతి విద్యార్ధిని దారుణహత్యకు గురయ్యారు.ఈ ఘటనకు సంబంధించి ఓ ట్యూనీషియా జాతీయుడిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
శనివారం లండన్‌లోని క్లర్కెన్వెల్ ప్రాంతంలోని ఆర్భర్ హౌస్ స్టూడెంట్ ఫ్లాట్స్‌లో 19 ఏళ్ల భారత సంతతికి చెందిన సబితా తన్వానీ మెడపై తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడివున్నారు.
ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న మెట్రోపాలిటన్ పోలీసులు.22 ఏళ్ల మహేర్ మారూఫ్ కోసం ఎమర్జెన్సీ అప్పీల్ జారీ చేశారు.అతనికి మృతురాలితో రిలేషన్ వుందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో క్లర్కెన్వెల్ ఏరియాలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా మెట్ పోలీస్ స్పెషలిస్ట్ క్రైమ్ విభాగానికి చెందిన డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ లిండా బ్రాడ్లీ మాట్లాడుతూ.
మారూఫ్‌ను కనుగొనేందుకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.సబిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మారూఫ్‌కు సబితతో రిలేషన్ వుందని.కానీ అతను విద్యార్ధి కాడని బ్రాడ్లీ చెప్పారు.
అయితే మారూఫ్ ట్యునీషియా జాతీయుడని తెలిపారు.
ఈ సమయంలో తమ ప్రాధాన్యత ఆర్బర్ హౌస్‌లోని విద్యార్ధుల భద్రతేనని యునైట్ స్టూడెంట్స్ వసతి గృహం అధికారిక ప్రతినిధి చెప్పారు.ప్రస్తుత పరిస్ధితుల్లో పోలీసులు, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.మరోవైపు తన్వానీ హత్య పట్ల ఆమె కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఆమె ఒక ఏంజెల్ అన్నారు.సబిత నిండు నూరేళ్లు జీవిస్తుందని ఆశించామని, కానీ విషాదకరంగా ముగిసిందని.
ఎంతో ప్రేమించే వారి నుంచి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలని.
ఆడపిల్లలు, మహిళలు సురక్షితంగా వుండే రోజు రావాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.