ఇక్కడే అనుకున్నాం.. అమెరికాలోనూ ఇంతేనా: బిడ్డను కని కిటీకీలోంచి విసిరేసిన భారతీయురాలు

బిడ్డను కని వదిలిపెట్టిన తల్లి.ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పలో విసిరేసిన తల్లిదండ్రులు వంటి ఘటనలు భారతదేశంలో అడుగడుగునా సర్వసాధారణం.

 Indian-origin Woman In Us Throws Newborn Out Of Window, Indian-origin Woman, Us,-TeluguStop.com

ఇక బ్రూణ హత్యల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.చట్టాలపై చట్టాలు చేస్తున్నా చర్యలు చేపడు తున్నామని పాలకులు ఎంతగా చెప్తున్నా దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్రూణహత్యలు నియంత్రించడంలో పాలకులు విఫలమవుతున్నారని చెప్పక తప్పదు.

ప్రభుత్వపరంగా ఈ చట్టాలను అమలు చేయడంలో అధికారులు అవలంభిస్తున్న ఉదాసీన వైఖరి వల్లనే ఈ బ్రూణ హత్యల పరంపర కొనసాగుతూ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

మనోళ్లకున్న ఈ పాడు బుద్ధి పరాయి గడ్డ మీదా కొనసాగడం దురదృష్టకరం.

అయితే మన దగ్గర చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తారేమో కానీ.ప్రాణం విలువ తెలిసిన విదేశీయులు ఇలాంటి చర్యకు పాల్పడిన ఓ భారతీయురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ మహిళ బాత్‌రూంలో బిడ్డను కని, కిటికీలోంచి విసిరి పారేసింది.

వివరాల్లోకి వెళితే.

సబితా దూక్రమ్ (23) అనే మహిళ న్యూయార్క్‌లోని క్వీన్స్ లో ఉంటోంది.శనివారం స్నానం చేస్తున్న టైమ్ లో ఆమెకు మగబిడ్డ పుట్టాడు.

సబిత భయంతో ఆ బిడ్డను బాత్ రూమ్‌లోని కిటికీలో నుంచి బయటకు విసిరేసింది.పిల్లాడి ఏడుపులు విన్న పక్కింటోళ్లు పోలీసులకు సమాచారం అందజేయడంతో అసలు విషయం బయటపడింది.

తీవ్రగాయాలైన పిల్లాడిని హాస్పిటల్ లో చేర్పించామని, కండిషన్ సీరియస్ గా ఉందని పోలీసులు తెలిపారు.వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు ట్రీట్ మెంట్ అందజేస్తున్నారని చెప్పారు.

అసలు తాను గర్భందాల్చినట్లే తాను గుర్తించలేదని స్నానం చేస్తుండగా నాకు డెలివరీ అయింది.ఏం చేయాలో అర్థం కాలేదు.భయంతో ఆ బిడ్డను బాత్ రూమ్ కిటికీలో నుంచి బయట పడేశాను.బట్టలు ఉతికేసి స్నానం చేసి పడుకున్నాను.

నన్ను క్షమించండి” అని సబిత పోలీసుల విచారణలో ఒప్పుకుంది.ఆమెపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube