అమెరికా కోర్టులో దావా వేసిన భారతీయ మహిళ..రీజన్ ఏంటంటే..!!

కరోనా రక్కసి కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోయింది.కంపెనీలు మూత పడటంతో దిక్కు తోచని స్థితిలో ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వలస వాసులు.

 Corona Virus, America, Donald Trump, Elections, Work Visa, Ranjita Subrahmanyam,-TeluguStop.com

ఇక నవంబర్ 3 నుంచీ అమెరికాలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అమెరికన్స్ ఓట్ల కోసం వలసవాసుల వీసాలపై ఎన్నో రకాల ఆంక్షలు పెట్టిన ట్రంప్ ప్రభుత్వం వర్క్ వీసాలపై తాత్కాలిక రద్దు ప్రకటించిన విషయం విధితమే.ఈ క్రమంలోనే భర్తీ కాబోయే ఉద్యోగాలలో అమెరికన్స్ కి చోటు కల్పిస్తామని కూడా ప్రకటించింది.

అయితే ట్రంప్ ఆదేశాల మేరకు నడుచుకుంటున్న అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పలువురు వలసవాసులు వర్క్ వీసాల రెన్యువల్స్ ని పక్కన పెడుతోంది.తాజాగా రంజితా సుబ్రహ్మణ్యం అనే వివాహిత ఇదే విషయంపై అమెరికా కోర్టులో అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పై కోర్టులో దావా వేసింది.

ఇమ్మిగ్రేషన్ వారు చేస్తున్న ఆలస్యం కారణంగా తన ఉద్యోగం పోయే అవకాశం ఉందని మరో కొన్ని కారణాలని జోడిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు.

Telugu America, Corona, Donald Trump, Vinod Simha, Visa-

రంజిత భర్త వినోద్ సింహ హెచ్-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తుండగా, హెచ్ -4 వీసా తో రంజిత ఉద్యోగం చేస్తున్నారు.అయితే ఎంప్లాయ్మెంట్ ఆధరైజేషన్ డాక్యుమెంటేషన్ పొడిగించాలని రంజిత ఏప్రియల్ నెలలో దరఖాస్తు చేయగా అదే నెల 7 న ఇమ్మిగ్రేషన్ వారు ఆమోదించారు.కానీ ఇప్పటి వరకూ ఆమెకి వర్క్ పర్మిట్ కార్డ్ ని జారీ చేయలేదు.

వారిని ఎన్ని సార్లు అడిగినా స్పందనలేదని ఆగస్ట్ 9 దాటితో తన ఉద్యోగం పోతుందని ఇక తప్పక కోర్టుని ఆశ్రయించానని ఆమె తెలిపారు….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube