యూకే: స్నేహితురాలికి వేధింపులు, కాపాడబోయిన భారతీయురాలిపై దాడి

యూకేలో ఓ భారత సంతతి మహిళా న్యాయవాదిపై అల్లరి మూకలు తీవ్రంగా దాడి చేశాయి.ఇంగ్లాండ్‌లోని సోలిహుల్ పట్టణానికి చెందిన 29 ఏళ్ల మీరా సోలంకా తన మిత్రులతో కలిసి సోమవారం రాత్రి మిడ్‌లాండ్స్‌లో తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

 Indian Origin Woman Beaten For Trying To Save Chinese From Racist Attack Over C-TeluguStop.com

ఈ కార్యక్రమానికి లండన్‌లో ఉంటున్న చైనాకు చెందిన ఆమె స్నేహితురాలు మాండీ హువాంగ్‌ కూడా హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆమె తన స్నేహితులతో కలిసి డ్రింక్స్ తీసుకుంటున్నారు.

వారిని గమనించిన ఆసియాకు చెందిన యువకుల గుంపు సోలంకి వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించింది.వీరిలో ఒక యువకుడు మాండీ హువాంగ్‌ను చూసి జాతి విద్వేష వ్యాఖ్యలతో పాటు కరోనా పేరిట అవహేళనగా మాట్లాడాడు.

దీంతో ఆగ్రహానికి గురైన మీరా అతనిని పక్కకు నెట్టింది.ఆ వెంటనే అతను మీరా తలపై బలంగా కొట్టడంతో ఆమె పెవ్‌మెంట్‌పై పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

Telugu Chinese, Corona, Indian Origin, Indianorigin, Telugu Nri-Telugu NRI

వెంటనే స్పందించిన ఆమె స్నేహితులు సోలంకీని ఆసుపత్రికి తరలించారు.చికిత్స అనంతరం మీరా మాట్లాడుతూ.అతని ప్రవర్తన, మాటలు చూసి తనకు భయం వేసిందని ఆమె తెలిపారు.తాను స్పృహ తప్పిన సమయంలో అతను ఇంకా తన మిత్రులను బెదిరించడం, వేధింపులకు పాల్పడటం చేస్తూనే ఉన్నాడని మీరా ఆవేదన వ్యక్తం చేసింది.

Telugu Chinese, Corona, Indian Origin, Indianorigin, Telugu Nri-Telugu NRI

దీనిపై బర్మింగ్‌హామ్ చైనీస్ సోసైటీ స్పందిస్తూ.కరోనా వైరస్ పేరిట చైనీయులపై దాడులకు దిగుతున్నారని మండిపడింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సదరు వ్యక్తిని ఆసియా వాసిగా అనుమానిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్‌లలో 4,00,000 మంది చైనీయులు నివసిస్తున్నట్లు సమాచారం.మరోవైపు చైనాలో 77,000 మందికి పైగా కరోనా బారిన పడగా, వీరిలో 2,500 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు కరోనా ముప్పును ఎదుర్కొంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube