మార్స్‌పై నాసా ప్రయోగం: గుట్టువిప్పే ‘‘పెర్సీవరెన్స్’’ రోవర్‌ను నడిపేది భారతీయ మహిళే..!!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పెర్సీవరెన్స్ రోవర్ అక్కడ తన పనిని ప్రారంభించింది.ఎస్‌యూవీ పరిమాణంలో వున్న ఈ రోవర్ జెజెరో కార్టర్ వద్ద పురాతన సూక్ష్మజీవుల గుట్టు విప్పేందుకు కదులుతోంది.

 Indian-origin Vandi Verma Drives Perseverance Rover On Mars Says Its Incredible,-TeluguStop.com

అత్యంత కీలకమైన ఈ ప్రయోగంలో భారత సంతికి చెందిన వంది వర్మా.ఈ రోవర్‌ను నడుపుతున్నారు .నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ (జేపీఎల్)లో రోబోటిక్స్ ఆపరేషన్స్ చీఫ్ ఇంజనీర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు.అంగారకుడి మీద పురాతన సరస్సుగా చెబుతున్న ఒక బిలం వద్ద రోవర్ కదలికలను వర్మ పర్యవేక్షిస్తున్నారు.

పంజాబ్‌లోని హల్వారా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఆమె తండ్రి గతంలో భారత వైమానిక దళ పైలట్‌గా పనిచేశారు.కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్‌లో ఆమె పీహెచ్‌డీ చేశారు.2008 నుంచి ఆమె రోవర్స్‌ను విజయవంతంగా నడుపుతున్నారు.

అంగారకుడిపైకి నాసా ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాల్లో పెర్సీవరెన్స్ తొమ్మివది.

అరుణ గ్రహంపైకి పంపిన అతిపెద్ద, అత్యంత అధునాతన వాహనం.కారు సైజులో ఉన్న రోవర్.

ప్లూటోనియం శక్తితో కూడిన వాహనం.పూర్తిగా రాళ్లు, గుంతలు, నదీ పరివాహక ప్రాంతమైన జెజెరో క్రేటర్ సరస్సు వద్ద దిగింది.మార్స్పై జీవజాలం ఉన్నట్లయితే.3-4 బిలియన్ ఏళ్ల క్రితం ఉండి వుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.వచ్చే రెండేళ్ల పాటు తవ్వకాలు చేపట్టి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించనుంది రోవర్.అనుకున్న ప్రకారం రోవర్‌ నమూనాలను సేకరించి అంతరిక్షంలో భూమి మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వ్యోమనౌకకు అందించ గలిగితే 2031 నాటికి ఆ కాప్స్యుల్ శాస్త్రవేత్తల చేతికి అందనుంది.

అంతకు మునుపే అంటే 2030కి వ్యోమగాములను అంగారకంపైకి పంపేందుకు నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

రోవర్ తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఇంజనీర్లు, డ్రైవర్లు, ప్లానర్ల బృందం అరుణ గ్రహంపై దానికి నావిగేషన్ చేస్తుంటారు.

భూమి- మార్స్ మధ్య రేడియో సిగ్నల్స్ ఆలస్యం అయితే రోవర్‌ను జాయ్ స్టిక్ ఉపయోగించి నడపడం సాధ్యం కాదు.అందువల్ల ఇంజనీర్లు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి వుంటుంది.

ఇందుకోసం సరస్సు వున్నట్లుగా చెబుతున్న బిలం శాటిలైట్ చిత్రాలపై ఆధారపడతారు.రోవర్ పరిసరాల్లోని మార్టిన్ ఉపరితలాన్ని చూడటానికి 3డీ గ్లాసులను ఉపయోగిస్తారు.

Telugu Auto System, Carnegie Mellon, Joystick Rover-Telugu NRI

బృంద చర్చల అనంతరం అంగారకుడిపై వున్న రోవర్‌కు సూచనలు చేస్తుంటారు.గతంలోని ప్రయోగాల మాదిరిగా కాకుండా పెర్సీవరెన్స్ రోవర్.దానిలో అమర్చిన కంప్యూటర్లలో ఒకదానిని ఉపరితలంపై నావిగేషన్ కోసం ఉపయోగించుకుంటుంది.దాని ప్రధాన కంప్యూటర్ రోవర్‌ను ఎల్లప్పుడూ చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుతుంది.రోవర్ కొన్ని సమయాల్లో శక్తివంతమైన ఆటో నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి డ్రైవ్ బై బాధ్యత తీసుకుంటుంది.ఆటోనావ్ అని పిలవబడే ఈ మెరుగైన వ్యవస్థ మార్స్ భూభాగానికి సంబంధించి 3 డీ మ్యాప్‌లను దానికి ముందుగానే చేరవేస్తుంది.

విజువల్ ఓడోమెట్రీ అనే వ్యవస్థ ద్వారా రోవర్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎంత దూరం వెళ్లిందనేది కూడా తెలుసుకోవచ్చని నాసా తెలిపింది.ఈ రోవర్ తొలి 100 రోజుల్లోనే మార్టిన్ వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను కూడా తయారు చేసిందని నాసా వెల్లడించింది.

Telugu Auto System, Carnegie Mellon, Joystick Rover-Telugu NRI

కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ ఈ ఏడాది ఫిబ్రవరి 19న అంగారకుడిపై విజయవంతంగా దిగింది.అంగారకుడి ఈక్వేటర్‌కు సమీపంలో ఉన్న జెజెరో అనే లోతైన బిలం సమీపంలో నాసా రోవర్‌ దిగింది.ఇది కనీసం రెండేళ్ల పాటు మార్స్‌పైనే ఉండి పరిశోధనలు కొనసాగిస్తుంది.దీనిలో భాగంగా అక్కడ జీవం ఉందా అనే అంశాన్ని కనిపెట్టేందుకు.అక్కడి రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి లభించిన మట్టి తదితరాలను విశ్లేషిస్తుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని పర్యవేక్షించింది ఓ భారతీయ మహిళ కావడం మనందరికీ గర్వకారణం.

భార‌త సంత‌తికి చెందిన డాక్ట‌ర్ స్వాతి మోహ‌న్.రోవ‌ర్ ల్యాండింగ్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ను ప‌ర్య‌వేక్షించారు.

ప‌ర్సీవ‌రెన్స్ ఆప‌రేష‌న్స్ అన్నింటికీ లీడ్ సిస్ట‌మ్స్ ఇంజినీర్‌గా స్వాతి మోహ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube