హిందూ ఆలయాలపై దాడులు : అమెరికా న్యాయశాఖకు భారత సంతతి కాంగ్రెస్ సభ్యుల లేఖ

గత శుక్రవారం అమెరికాలోని ఐదుగురు భారతీయ సంతతికి చెందిన చట్టసభ సభ్యులు దేశంలోని హిందూ దేవాలయాలపై( Hindu Temples ) చోటు చేసుకుంటున్న దాడులపై జరుగుతున్న దర్యాప్తుపై స్టేటస్ సమాచారం కోరుతూ న్యాయశాఖలోని పౌర హక్కుల విభాగానికి లేఖ రాశారు.ఈ లేఖను యూఎస్ ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Raja Krishnamoorthi ) రాయగా.

 Indian-origin Us Lawmakers Write To Justice Department Over Attacks On Hindu Man-TeluguStop.com

మరో నలుగురు భారత సంతతి కాంగ్రెస్ సభ్యులు శ్రీథానేదర్, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీబెరాలు సంతకం చేశారు.హిందూ అడ్వకేసీ గ్రూప్ ‘‘ హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)( Hindu American Foundation ) ఈ లేఖ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

హిందూ మందిరాలు సహా దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లో విధ్వంసకర సంఘటనలు పెరుగుతుండటాన్ని తాము గమనించామని వారు లేఖలో పేర్కొన్నారు.

న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు మందిరాలపై దాడులు హిందూ అమెరికన్లలో సామూహిక ఆందోళనను పెంచాయని కాంగ్రెస్ సభ్యులు( Congress Members ) ప్రస్తావించారు.

దీని కారణంగా కమ్యూనిటీ సభ్యులు భయం, బెదిరింపులతో జీవితాన్ని కొనసాగిస్తున్నారని భారత సంతతి చట్టసభ సభ్యులు తెలిపారు.ఈ పక్షపాత, ప్రేరేపిత నేరాలకు సంబంధించి చట్ట అమలు సమన్వయం గురించి మా కమ్యూనిటీలు ఆందోళన చెందుతున్నాయి.

Telugu American Hindus, Ami Bera, Congress, Hindu American, Hindu Mandirs, Hindu

చట్టం ప్రకారం సమాన రక్షణను నిర్ధారించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ వుందా అని వారు ప్రశ్నించారు.అమెరికాలోని అన్ని మత , జాతి, సాంస్కృతిక మైనారిటీలపై ద్వేషాన్ని ఎదుర్కోవడానికి తాము సహకారంతో పనిచేయాలని భారత సంతతి నేతలు పేర్కొన్నారు.అమెరికాలో హిందువులను( American Hindus ) లక్ష్యంగా చేసుకున్న ద్వేషపూరిత నేరాలకు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్( Department Of Justice ) వ్యూహం గురించి తమకు అవగాహన కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.పరిస్ధితి తీవ్రతను దృష్టిలో వుంచుకుని గురువారం (ఏప్రిల్ 18వ తేదీ) లోపు తమకు బ్రీఫింగ్ అందించాల్సిందిగా భారత సంతతి చట్టసభ సభ్యులు కోరారు.

Telugu American Hindus, Ami Bera, Congress, Hindu American, Hindu Mandirs, Hindu

కాగా.ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవార్డ్ నగరంలోని విజయ్ షెరావాలి ఆలయాన్ని కొందరు దుండగులు ఖలిస్తానీ అనుకూల నినాదాలతో అపవిత్రం చేశారు.దేవాలయం గోడలపై పిచ్చిరాతలు రాశారు.అంతకుముందు 2023 డిసెంబర్ 22న కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలోని స్వామినారాయణ్ మందిర్ వాసనా సంస్థ గోడలపైనా ఖలిస్తాన్ మద్ధతుదారులు పిచ్చిరాతలు రాశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube