స్పెల్లింగ్ బీ 2023 విజేత భారత సంతతి బాలుడు .. బహుమానంగా ఎంత గెలిచాడో తెలుసా..?

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి పిల్లలదే ఎప్పుడూ హవా.తాజాగా దానిని మరోసారి నిజం చేస్తూ ‘‘ 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’’ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్ షా విజయం సాధించాడు.

 Indian-origin Teen Dev Shah Wins Us Spelling Bee 2023, Takes Home $50,000 Cash P-TeluguStop.com

ఫైనల్‌లో “psammophile” అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి దేవ్ షా విజేతగా నిలిచి 50 వేల డాలర్ల బహుమతిని గెలుచుకున్నాడు.మేరీల్యాండ్‌లోని నేషనల్ హార్బర్‌లో జరిగిన పోటీల అనంతరం దేవ్ షా( Dev Shah ) మాట్లాడుతూ.

తాను గెలిచానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు.“psammophile” అనేది ఇసుక ప్రాంతాల్లో వృద్ధి చెందే మొక్క లేదా జంతువు అని వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రిక నివేదించింది.

Psammo అంటే గ్రీకు భాషలో ఇసుక అని .“Phile’’ అంటే అదే భాషలో ప్రేమ అని అర్ధమా అని దేవ్ షా ప్రశ్నించాడు.

తనను అడిగిన పదం గురించి షాకు అప్పటికే విషయం అర్ధమైంది.అయితే సేఫ్ పాయింటాఫ్ వ్యూలో దీనికి సంబంధించి సమాచారాన్ని న్యాయ నిర్ణేతల నుంచి అడిగి తెలుసుకున్నాడు.

అయితే ఆ ప్రశ్న అడిగినప్పడు దేవ్ షాను చూస్తే అతని ముఖంలో ఎలాంటి భయం కనిపించలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.స్పెల్లింగ్ బీ ( Spelling Bee )పోటీల్లో దేవ్ షాకు ఇది మూడో ప్రయత్నం.

గతంలో 2019, 2021లో అతను పోటీపడ్డాడు.తాజా ఫైనల్‌లో అతను గెలిచినట్లు న్యాయ నిర్ణేతలు ప్రకటించగానే షా కుటుంబం వేదికపైకి చేరుకుని భావోద్వేగానికి గురైంది.

తన బిడ్డ నాలుగేళ్లుగా స్పెల్లింగ్ బీ పోటీల కోసం సిద్ధమవుతున్నాడని అతని తల్లి చెప్పింది.

-Telugu NRI

ఈ ఏడాది 11 మిలియన్ల మంది స్పెల్లింగ్ పోటీల్లో తలపడగా.11 మంది విద్యార్ధులు ఫైనల్‌కు షార్ట్ లిస్ట్ అయ్యారు.మంగళవారం నుంచి ప్రాథమిక రౌండ్లు ప్రారంభంకాగా.

బుధవారం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ జరిగాయి.ఈ పోటీల్లో దేవ్ షా విజేతగా నిలిస్తే.

వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌కు( Arlington, Virginia ) చెందిన 14 ఏళ్ల షార్లెట్ వాల్ష్ ( Charlotte Walsh )రన్నరప్‌గా నిలిచింది.

-Telugu NRI

ఇకపోతే.గతేడాది స్పెల్లింగ్ బీ పోటీలలో విన్నర్‌, రన్నరప్ రెండూ ట్రోఫీలు భారతీయ చిన్నారులకే దక్కాయి.టెక్సాస్‌లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్ (14) విజేతగా అవతరించింది.

అలాగే భారత సంతతికే చెందిన విక్రమ్ రాజు( Vikram ) (12) రెండో స్థానంలో నిలిచాడు.విజేతను నిర్ధారించే చివరి రౌండ్‌లోని 90 సెకన్లలో హరిణి ఏకంగా 21 పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి విజేతగా నిలిచింది.

scyllarian, pyrrolidone, Otukian, Senijextee వంటి కఠినమైన పదాలకి సైతం కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి హరిణి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube