సిగ్నల్ జంప్.. యాక్సిడెంట్: భారత సంతతి డ్రైవర్‌కు వెరైటీ శిక్ష

సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని చెబుతారు.చిన్న తప్పులకు సైతం పనిష్మెంట్ ఓ రేంజ్‌లో ఉంటుందని మనం తరచుగా వార్తల్లో వింటూ ఉంటాం.

 Indian Origin Taxi Driver Sentenced For 2 Years Community Service-TeluguStop.com

అయితే యాక్సిడెంట్‌కు కారణమైన భారత సంతతి టాక్సీ డ్రైవర్‌కు అక్కడి న్యాయస్థానం వింత శిక్ష విధించింది.

గుర్బేజ్ సింగ్ అనే వ్యక్తి మెల్‌బోర్న్‌లో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో 2017 డిసెంబర్‌లో నగరంలోని ఫ్లిండర్స్ స్ట్రీట్‌లో బైక్‌ మీద వెళుతున్న వాహనదారుడిని ఢీకొట్టాడు.దీంతో సదరు వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు గుర్బేజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం విక్టోరియా కౌంటీ కోర్ట్ తుదితీర్పును వెలువరించింది.

Telugu Taxi, Telugu Nri Ups-

 గుర్బేజ్ ట్రాఫిక్ సిగ్నల్ దాటే సమయంలో రెడ్ సిగ్నల్ గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరించకుండా వాహన ప్రమాదానికి కారణం అయినందుకు గాను రెండేళ్లు ఎటువంటి సామాజిక సేవ చేయాలని.శిక్షా కాలం ముగిసే వరకు ఎలాంటి వాహనాలు నడపకూడదని ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube