లండన్: దిగ్గజ బ్రిటీష్ బ్యాంక్‌ ‘‘ బార్క్‌లేస్‌’’ ‌కు సీఈవోగా భారతీయుడు.. ఎవరీ వెంకటకృష్ణన్..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ప్రస్తుతం పలు కీలక సంస్థలకు సారథులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలకు పలువురు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు.

 Indian-origin Takes Over As The Head Of Barclays , Satyanadella, Sundar Pichai,-TeluguStop.com

సత్యనాదెళ్ల, సుందర్ పిచాయి, అరవింద్ కృష్ణ, ఇంద్రా నూయి వంటివారు విజయవంతంగా కంపెనీలను నడిపిస్తున్నారు.తాజాగా బ్రిటీష్ దిగ్గజ బ్యాంక్ ‘‘బార్క్‌లేస్’’కు సీఈవోగా భారత సంతతికి చెందిన సీఎస్ వెంకటకృష్ణన్ నియమితులయ్యారు.

ఫైనాన్షియర్, సెక్స్ నేరాల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బార్క్‌లేస్‌ సీఈవోగా వున్న జెస్ స్టాలీకి సంబంధాలు వున్నట్లుగా బ్రిటీష్ రెగ్యులేటింగ్ సంస్థలు నివేదికను ఇవ్వడంతో స్టాలీ తన పదవికి రాజీనామా చేశారు.దీంతో బార్క్‌లేస్ గ్లోబల్ మార్కెట్స్ హెడ్‌గా వున్న సీఎస్ వెంకటకృష్ణన్‌.

బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు.

కర్ణాటక రాష్ట్రం మైసూరులో పుట్టిన వెంకటకృష్ణన్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.

అక్కడి ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ చేశారు.వెంకటకృష్ణన్, జేస్ స్టాలీలు జేపీ మోర్గాన్‌లో కలిసి పనిచేశారు.

స్టాలీ.జేపీ మోర్గాన్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంకటకృష్ణన్‌తో పాటు తన మాజీ సహచరులను బార్క్‌లేస్‌లోకి తీసుకొచ్చారు.

కాగా.బార్క్‌లేస్ సీఈవోగా వెంకట కృష్ణన్ 2.7 మిలియన్ పౌండ్ల వేతనాన్ని అందుకుంటారు.ఇందులో 50 శాతాన్ని నెలవారీగా , మిగిలిన 50 శాతాన్ని షేర్ల రూపంలోనూ చెల్లిస్తారు.

అలాగే ఏడాదికి 1,35,000 పెన్షన్‌కు బదులుగా నగదు చెల్లింపును అందుకుంటారని బార్క్‌లేస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు సీఈవోగా జేస్ స్టాలీ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో బార్క్‌లేస్ షేర్ గత సోమవారం ఉదయం 1.2 శాతం తక్కువగా ట్రేడ్ అయ్యింది.బిలియనీర్, ఫైనాన్షియర్ ఎప్‌స్టీన్ పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి జూలై 2019లో అరెస్ట్ అయ్యాడు.

అయితే ఒక నెలకే మాన్‌హాటన్‌లోని ఫెడరల్ జైలులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.స్టాలీ 2015 అక్టోబర్‌లో బార్క్‌లేస్‌‌‌కు సీఈవోగా బాధ్యతలు స్వీకరించాడు.అయితే తనకు 2015లోనే ఎప్‌స్టీన్‌తో సంబంధాలను కట్ చేసుకున్నానని చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube