అమెరికాలోని టోల్ రోడ్ అథారిటీకి డైరెక్టర్‌గా భారత సంతతి వ్యక్తి..!!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇటీవల భారతీయ మూలాలున్న వారు కీలక పదవులు అందుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా ఫోర్డ్ బెండ్ టోల్ రోడ్ అథారిటీ అండ్ గ్రాండ్ పార్క్‌వే టోల్ రోడ్ అథారిటీ డైరెక్టర్ల బోర్డులో భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు.

 Indian-origin Swapan Dhairyawan Appointed As Director Of Toll Road Authority In-TeluguStop.com

ఆర్ధిక నైపుణ్యం, వృత్తి అనుభవం తదితర అంశాలను దృష్టిలో వుంచుకుని స్వపన్ ధైర్యవాన్ (57) ఈ పదవిలో నియమితులయ్యారు.దీనిపై Precinct 3 కమీషనర్ ఆండీ మేయర్స్ స్పందిస్తూ.

గ్రాండ్ పార్క్ వే టోల్ వే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ధైర్యవాన్‌ను నియమించడం తనకు గర్వకారణంగా వుందన్నారు.అతను సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, ప్రజల డబ్బుకు జవాబుదారీగా వుంటాడని మేయర్స్ పేర్కొన్నారు.

ఈ సంస్థ డైరెక్టర్‌గా.కౌంటీ నిర్వహణ, విస్తరణ, బడ్జెట్, ఆర్ధిక అంశాలను ధైర్యవాన్ పర్యవేక్షిస్తారు.

తన నియామకంపై ధైర్యవాన్ స్పందిస్తూ.కమీషనర్ ఆండీ మేయర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

టోల్ వేలు ప్రజలను కనెక్ట్ చేయడమే కాకుండా పొరుగు ప్రాంతాలకు ఆర్ధిక ఇంజిన్‌గా వుంటాయని చెప్పారు.

Telugu America, Toll Road, Fortbend, Grandparkway, Houston, Indian Origin, Texas

ఇదిలావుండగా.గతేడాది భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా హ్యూస్టన్‌లోని ఇండియా కల్చర్ సెంటర్ నుంచి ధైర్యవాన్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.ఆయన 1988లో ముంబై యూనివర్సిటీ నుంచి అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.1990లో కలకత్తాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొఫెషనల్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ డిగ్రీని కూడా ధైర్యవాన్ అందుకున్నారు.తర్వాత 1999లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు.

Telugu America, Toll Road, Fortbend, Grandparkway, Houston, Indian Origin, Texas

అనంతరం 2004లో టెక్సాస్ స్టేట్ బోర్డ్ నుంచి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ లైసెన్స్‌ను పొందారు.ఇదే సమయంలో ఎండీ అండ్ అసోసియేట్స్ ఎల్ఎల్‌పీని ప్రారంభించారు.ధైర్యవాన్ హ్యూస్టన్‌లోని ఇండియా కల్చర్ సెంటర్ (ఐసీసీ), ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్, ఇంటర్నేషనల్ హిందీ అసోసియేషన్, ఫౌండేషన్ ఫర్ ఇండియా స్టడీస్ (ఎఫ్ఐఎస్), ఇండియన్ అమెరికన్‌ సహా పలు లాభాపేక్ష లేని సంస్థల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube