కమలా హారిస్‌కు పోటీనా: అమెరికా ఉపాధ్యక్ష బరిలో మరో భారత సంతతి వ్యక్తి..!!  

Meet Sunil Freeman The Second Indian-American Running For US Vice President Post, US Vice President Post, America Elections, Kamala Harris, Sunil Freeman, Indian Origin - Telugu America Elections, Indian Origin, Kamala Harris, Meet Sunil Freeman The Second Indian-american Running For Us Vice President Post, Sunil Freeman, Us Vice President Post

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొత్తం ఇప్పుడు భారతీయుల చుట్టూనే తిరుగుతున్నాయి.దశాబ్ధాల క్రితం అగ్రరాజ్యంలో స్థిరపడిన మనోళ్లు అక్కడ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు.

TeluguStop.com - Indian Origin Sunil Freeman Vice Presidential Candidate

ఇక ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా భారతీయులదే తుది నిర్ణయం.అలాంటి స్థితిలో వున్న ఇండో అమెరికన్ల నుంచి తొలిసారిగా డెమొక్రాటిక్ పార్టీ తరపున కమలా హారిస్ ఉపాధ్యక్ష బరిలో నిలిచారు.

ఈ పదవి కోసం అభ్యర్ధిగా ఎంపికైన తొలి దక్షిణాసియా, నల్లజాతి మహిళగా కమలా హారిస్ రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - కమలా హారిస్‌కు పోటీనా: అమెరికా ఉపాధ్యక్ష బరిలో మరో భారత సంతతి వ్యక్తి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలో ఆమెకు పోటీగా భారత సంతతికే చెందిన మరో వ్యక్తి ఉపాధ్యక్ష రేసులో నిలిచారు.

సునీల్ ఫ్రీమాన్ (65) అనే భారతీయుడు పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ (పీఎస్ఎల్) తరపున ఉపాధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు.సునీల్ బలమైన రాడికల్ సోషలిస్ట్.

అందువల్ల కమల సోషలిస్ట్ అయితే.సునీల్ మరింత కరడుగట్టిన సోషలిస్ట్ అని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు.

సునీల్ తల్లి ఫ్లోరా నవిత భారతీయ మహిళ కాగా, తండ్రి చార్లెస్ ఫ్రీమాన్ అమెరికన్ జాతీయుడు.వారణాసిలో శరణార్ధి శిబిరంలో నవిత ఉపాధ్యాయురాలిగా వున్నప్పుడు అమెరికన్ పీస్ గ్రూప్ తరపున భారత పర్యటనకు వచ్చిన చార్లెస్ ఆమెను తొలిసారి కలిశారు.

ఈ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.తన తల్లి ఎప్పుడూ చీరలనే ధరిస్తారని, దశాబ్ధాలుగా అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఆమెకు ఇంకా భారత పౌరసత్వం వుందని సునీల్ పేర్కొన్నారు.

ఢిల్లీకి చెందిన ఫ్లోరా నవిత లక్నోలోని ఇసాబెల్ థౌబర్న్ కళాశాలలో పట్టభద్రులయ్యారు.వివాహం తర్వాత నవిత.చార్లెస్‌తో కలిసి అమెరికాకు వచ్చేశారు.వాషింగ్టన్‌లోనే పుట్టి పెరిగిన సునీల్ పదేళ్ల వయసులో భారతదేశానికి వెళ్లారు.అవి తన జీవితంలో అత్యంత మధుర క్షణాలని.నాటి భారత పర్యటన తనపై బలమైన ముద్ర వేసిందని సునీల్ చెబుతారు.

తమ పీఎస్ఎల్ పార్టీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను అనుసరిస్తుందని సునీల్ వెల్లడించారు.కానీ తాము హింసా మార్గంలో కాకుండా.

చట్టాన్ని అనుసరించి మార్పు కోసం ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.తమ ఆశయాలను చేరుకునేందుకు సోషలిజాన్ని సోపానంగా భావిస్తామని… అయితే ఇందుకు చాలా సమయం తీసుకుంటుందని సునీల్ పేర్కొన్నారు.
ఇదే పార్టీ తరపున గ్లోరియా లా రివా అధ్యక్ష అభ్యర్ధిగా నిలిచారు.గ్లోరియా 2008 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు.అయితే తమ పార్టీ కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్ వంటి 14 రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేస్తుందని సునీల్ వెల్లడించారు.మరోవైపు అధ్యక్ష ఎన్నికలకు కేవలం ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది.

దీంతో అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ సైతం జోరుగా ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటున్నారు.

#MeetSunil #USVice #Sunil Freeman #Indian Origin #Kamala Harris

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Sunil Freeman Vice Presidential Candidate Related Telugu News,Photos/Pics,Images..