బ్రిటన్‌లో సత్తా చాటిన ఢిల్లీ పారిశ్రామిక వేత్త: డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక

ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు క్రమంగా అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు.ఆయా దేశాల్లోని ఎన్నికల్లో విజయం సాధిస్తూ రాజకీయంగానూ ఎదుగుతున్నారు.

 Indian Origin Business Man Sunil Chopra Elected As Deputy Mayor In Uk, Britain,-TeluguStop.com

అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ఏ దేశంలో చూసినా భారతీయుల హవా స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యాడు.

ఢిల్లీకి చెందిన సునీల్ చోప్రా 40 ఏళ్ల క్రితం యూకేకు వలస వెళ్లారు.అక్కడ వ్యాపారాన్ని విస్తరించి పారిశ్రామిక వేత్తగా సక్సెస్ అయ్యారు.అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన సునీల్ చోప్రా.2013-14 సంవత్సరంలో మొదటిసారిగా లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.తద్వారా ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు.

అనంతరం సునీల్ 2014-2015 సంవత్సరంలో లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌‌కు మేయర్‌గా ఎన్నికయ్యారు.

తాజాగా ఇప్పుడు రెండోసారి డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.తన ఎన్నికపై సునీల్ చోప్రా మాట్లాడుతూ.

తాను భారతీయుడిని కావడం గర్వంగా ఉందన్నారు.ఈ విజయం తన కుటుంబంతో పాటు మొత్తం భారతీయ సమాజానికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube