అమెరికాలో భారతీయ విద్యార్ధి దుశ్చర్య..గాంధీ విగ్రహంపై పిటిషన్..!!!  

Indian-origin student seeks removal of Mahatma Gandhi, Mahatma Gandhi statue , California University , Black Lives Matter movement - Telugu Black Lives Matter Movement, California University, Indian-origin Student Seeks Removal Of Mahatma Gandhi, Mahatma Gandhi Statue

గాంధీ మహాత్ముడు జీవితాన్ని ప్రపంచం మొత్తం స్పూర్తిగా తీసుకుంటుంది.గాంధీ జీ భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుడు.

 Indian Origin Student Removal Of Mahatma Gandhi

అందుకే మన పాట్య పుస్తకాలలో మాత్రమే కాదు.వివిధ దేశాల పాట్య పుస్తకాలలో గాంధీజీ చరిత్ర పొందు పరిచి ఉంచారు.

ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన మహాత్ముడిని అన్ని దేశాలు విగ్రహాలని ఏర్పాటు చేసుకుని స్మరించుకుంటాయి.కానీ ఓ భారతీయ విద్యార్ధి మాత్రం గాంధీ జీ విగ్రహం ఉండరాదు అంటూ అమెరికాలో ఆన్లైన్ పిటిషన్ వేశాడు.

అమెరికాలో భారతీయ విద్యార్ధి దుశ్చర్య..గాంధీ విగ్రహంపై పిటిషన్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ సంఘటన భారతీయులని దిగ్భ్రాంతికి గురించేసింది ఆ వివరాలోకి వెళ్తే.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఫ్రెస్ లో పీస్ గార్డెన్ లో ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని తలగించాలని డిమాండ్ చేస్తూ భారత సంతతికి చెందిన అఖ్నూర్ సిద్దూ అనే విద్యార్ధి ఆన్లైన్ లో పిటిషన్ వేశారు.

అయితే ఈ పిటిషన్ పై స్పందించిన యూనివర్సిటీ కొట్టి పారేసింది.గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచీ తీసేది లేదని యూనివర్సిటీ అధ్యక్షుడు జోసెఫ్ క్యాస్ట్రో ప్రకటించారు.ఇదిలాఉంటే అదే యూనివర్సిటీ లో చదువుతున్న సిద్దూ నల్ల జాతీయుల నిరసనలకి మద్దతుగా ఈ పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది.

మే 25 తేదీన జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఘటన అందరికి తెలిసిందే.

ఈ ఘటన తరువాత అమెరికాలో వరుసగా విగ్రహాలని ధ్వంసం చేయడంకలకలం రేపింది.మహాత్మా గాంధీ విగ్రహంతో పాటుగా అమెరికాకి చెందిన ఎందరో చరిత్ర కారుల విగ్రహాలు ధ్వంసం చేసిన సంఘటనలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే భారతీయ విద్యార్ధి గాంధీ విగ్రహాన్ని తొలగించాలని పటిషన్ వేయడంతో సర్వాత్రా నిరసనలు రేగుతున్నాయి.ఒక పక్క భారతీయ విద్యార్ధి విగ్రహాని తలగించాలంటుంటే అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాత్రం గాంధీ వంటి స్పూర్తి వంతమైన వ్యక్తులని గౌరవించాలని ప్రకటించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Student Removal Of Mahatma Gandhi Related Telugu News,Photos/Pics,Images..