దక్షిణాఫ్రికా: స్థానికుల దాడులు.. కుటుంబాల రక్షణ కోసం ఆయుధం పట్టిన భారతీయులు

దక్షిణాఫ్రికా ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది.కోర్టు ధిక్కరణ కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా జైలుకు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు, ప్రజలు బీభత్సం సృష్టిస్తున్నారు.

 Indian Origin South Africans Take Up Arms To Defend Themselves,  South Africans,-TeluguStop.com

భద్రతా దళాలు-ఆందోళనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలతో వీధులన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి.ఇక నిరసనల ముసుగులో ప్రజలు దుకాణాలపై దాడులకు పాల్పడి అందినకాడికి దోచుకుంటున్నారు.

ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులతోపాటు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 117 మంది వరకు మరణించారని, వేల మంది అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

అయితే దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయులను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.అక్కడ సుమారు 20 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.కాగా, క్వాజులు, నాటాల్, జోహన్నెస్‌బర్గ్‌లలో స్థిరపడిన భారతీయులను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు.ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

అయితే తమకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోతుండటంతో తమ కుటుంబాల రక్షణ కోసం భారత సంతతి ప్రజలే ఆయుధం పట్టి.నిరసనకారులను ఎదుర్కొంటున్నారు.

కొన్ని చోట్ల వారి వ్యాపారాలను రక్షించుకోవడానికి ప్రైవేట్ సాయుధ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

Telugu Defend, Indianorigin, Africa, Africa Unrest, African, Africans-Telugu NRI

తాము వ్యాపారాలలో రాణిస్తుండటాన్ని చూసి స్థానికులు అసూయ చెందుతున్నారని డర్బన్‌కు చెందిన ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు.అందుకే ప్రస్తుత అల్లర్ల సమయాన్ని అదునుగా చేసుకుని స్థానిక ఆఫ్రికన్లు తమ దుకాణాలు, వ్యాపార సముదాయాలపై దాడులు చేసి దోచుకుంటున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.రక్షించాల్సిన పోలీసులే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అతను ఆరోపించాడు.

అంతేకాదు కొన్ని చోట్ల పోలీసులే ‘‘ దోచుకోండి, తగలబెట్టండి’’ అంటూ నిరసనకారులను రెచ్చగొడుతున్నారని చెప్పాడు.క్వాజులు నాటాల్‌లో స్థిరపడిన రాజేశ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.

తాము ఎన్నో తరాలుగా ఇక్కడే వుంటున్నామన్నారు.కానీ కొందరు స్థానికులు ఇప్పుడు ఇది మీ దేశం కాదు అంటూ దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Telugu Defend, Indianorigin, Africa, Africa Unrest, African, Africans-Telugu NRI

కాగా, ఒక్క డర్బన్‌లోనే భారత సంతికి చెందిన 50 వేల వ్యాపార సముదాయాలు, దుకాణాలు ధ్వంసమైనట్లుగా సమాచారం.దీని వల్ల సుమారు 16 బిలియన్ రాండ్లు నష్టం కలిగిందని అంచనా.మరోవైపు హింస, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించామని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది.హింసాకాండలో 117 మంది మరణించారని, వీరిలో భారత సంతికి చెందినవారే అధికంగా వున్నారని ప్రభుత్వం అంగీకరించింది.

అయితే జోహాన్నెస్‌బర్గ్ సాధారణ స్థితికి వస్తోందని.కానీ డర్బన్‌లో మాత్రం పరిస్ధితి ఇంకా ఉద్రిక్తంగా వుందని ప్రభుత్వం వెల్లడించింది.

ఇదే సమయంలో గుంపులు తమపై దాడి చేస్తే కాల్చి చంపుతామని ఓ భారత సంతతి వ్యాపారి తెలిపాడు.ఇప్పటికే తమ షాపులు, మాల్స్‌ను దోచుకున్నారని.అక్కడితో ఆగకుండా తమ ఇళ్లపై పడితే కుటుంబసభ్యులను కాపాడటానికి పోరాడతామని, అవసరమైతే ప్రాణాలు సైతం కోల్పోవడానికి సిద్ధమని చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube