సింగపూర్: గురునానక్‌పై భక్తిని చాటుకున్న భారత సంతతి సిక్కు దంపతులు

సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌పై సింగపూర్‌కు చెందిన భారత సంతతి సిక్కు జంట భక్తిని చాటుకుంది.ఆయన జీవిత కాలంలో సందర్శించిన పవిత్ర స్థలాలను, వాటి చరిత్రను వివరించేలా 24 ఎపిసోడ్ల డాక్యుమెంటరీని త్వరలో ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

 Indian-origin Singaporean Sikh Couple To Release Docuseries On Guru Nanak , Amar-TeluguStop.com

అమర్‌దీప్ సింగ్ ఆయన సతీమణి వినీందర్ కౌర్‌లు ఈ కార్యానికి శ్రీకారం చుట్టారు.TheGuruNanak.com వెబ్‌సైట్‌లో దీనిని రిలీజ్ చేయనున్నారు.

ఎవరైనా సరే దీనిని ఉచితంగా వీక్షించడంతో పాటు అవసరమైన వారు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చని అమర్‌దీప్ సింగ్ శుక్రవారం మీడియాకు తెలిపారు.తదుపరి దశలో ‘Lost Heritage Productions’ ‘SikhLens Productions’‌లు నిర్మించిన ఈ డాక్యుమెంటరీలను పంజాబీలు, హిందీలలోకి అనువదించి రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు.

దాదాపు 550 సంవత్సరాల క్రితం గురునానక్ సృష్టిలో ఏకత్వం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి 22 ఏళ్ల పాటు యాత్రలు చేశారు.ఆ క్రమంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టిబెట్, బంగ్లాదేశ్, భారత్‌, శ్రీలంక వంటి దేశాలలో పర్యటించారు.21వ శతాబ్ధంలో దేశాల మధ్య భౌగోళిక , రాజకీయ ఆంక్షలు గురునానక్ సందర్శించిన ప్రదేశాలను గుర్తించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి.ఆయన పర్యటించిన ప్రాంతంలో దాదాపు 70 శాతం ప్రదేశాలను చిత్రీకరించడం కూడా కష్టమే.

ఈ నేపథ్యంలో 2019 జనవరిలో అమర్‌దీప్ సింగ్, వినీందర్ కౌర్‌ల నాయకత్వంలోని బృందం గురునానక్‌ అడుగుజాడలను గుర్తించేందుకు ప్రయాణం ప్రారంభించింది.వ్యక్తిగత లక్ష్యానికి మించినదే అయినా గురునానక్ బోధనలను కాపాడాలనే అభిరుచితో ప్రయాణం సాగించినట్లు అమర్‌దీప్ చెప్పారు.

ఈ కార్యానికి పురాతన ‘‘జనంసాఖీల’’ (గురునానక్ జీవిత చరిత్రలు) ఎంతగానో తోడ్పడిందని చెప్పారు.దీని ఆధారంగా వీరి బృందం దాదాపు మూడు సంవత్సరాల పాటు గురునానక్ సందర్శించిన అన్ని ప్రదేశాలను చిత్రీకరించి 24 ఎపిసోడ్‌లతో డాక్యుమెంటరీని రూపొందించింది.

ప్రతికూల వాతావరణాలు ఎదురైనప్పటికీ.సౌదీ అరేబియాలోని మక్కా ఎడారుల నుంచి టిబెట్‌లోని కైలాష్ పర్వతం వరకు ప్రయాణించారు.ఆఫ్ఘనిస్తాన్‌లోని మారుమూల ప్రాంతాలను, ఇరాక్‌లో తీవ్రమైన వేడిని, పాకిస్తాన్‌లోని బలూచి పర్వతాలను అధిరోహించారని ఆయన చెప్పారు.అలాగే హిందూ మహాసముద్రంలోని జలాల మీదుగా ప్రయాణించి శ్రీలంకకు, ఇరాన్‌లోని పెర్షియన్ సంస్కృతితో మిళితమై, బంగ్లాదేశ్‌లోని డెల్టా ప్రాంతాన్ని దాటి భారతదేశంలోని నాలుగు దిక్కులను మ్యాప్ చేసినట్లు అమర్‌దీప్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube