సింగపూర్: ప్రభుత్వంపై ద్వేషం, పోలీస్ స్టేషన్ దగ్గర విధ్వంసం: భారత సంతతి యువకుడికి జైలు శిక్ష

పోలీస్ స్టేషన్ వెలుపల పేలుళ్లకు కారణమైన భారత సంతతి యువకుడికి సింగపూర్ కోర్ట్ 3.5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే శివప్రకాశ్ మెయిల్ రావణన్ అనే వ్యక్తి తాను నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు.అగ్నిప్రమాదం సృష్టించి అల్లర్లకు కారణమవడంతో పాటు మారణాయుధాన్ని కలిగివున్నాడని ది స్ట్రెయిట్స్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

 Indian-origin Singaporean Jailed For Vandalism Outside Police Post,  The Straits-TeluguStop.com

గత ఏడాది మార్చి 13న జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడనప్పటికీ ఆ సమీప ప్రాంతానికి, ఓ కారుకు 20,000 డాలర్ల నష్టం కలిగిందని కోర్ట్‌కు దర్యాప్తు అధికారులు ఆధారాలు సమర్పించారు.శివప్రకాశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడని తెలిపారు.

డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్కస్ ఫూ మాట్లాడుతూ శివప్రకాశ్ 2009 నుంచి సామాజిక వ్యవహారాలపై ఆసక్తి పెంచుకున్నాడని వివరించారు.కొన్నేళ్లుగా సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు అన్యాయంగా వున్నాయని.

అధికారులు మితిమీరిన నియంత్రణలో వున్నట్లు భావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నాడని ఫూ అన్నారు.ఈ క్రమంలో అతను పోలీస్ పోస్టును లక్ష్యంగా ఎంచుకున్నాడని ఆయన చెప్పారు.

ఎందుకంటే ఇది మాస్ రాపిడ్ ట్రైన్ (సబ్‌వే) స్టేషన్‌కు సమీపంలో వుంది.ఇక్కడ దాడి చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని శివప్రకాశ్ భావించాడు.

పోలీస్ కార్ల అద్దాలను పగులగొట్టి గుంపు ఏర్పడినప్పుడు ప్రసంగించి తన ఉద్దేశ్యాన్ని చెప్పాలని.తనను అరెస్ట్ చేస్తే కోర్టుకు ఫిర్యాదు చేయాలని కుట్రపన్నినట్లు ప్రాసిక్యూటర్ చెప్పారు.

Telugu Deputypublic, Isis, Shivaprakash, Straits Times-Telugu NRI

దీనిలో భాగంగా అపార్ట్‌మెంట్ 105 టౌనర్ రోడ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో వున్న పోలీస్ పోస్ట్ వద్ద గ్లాస్ ప్యానెల్‌లను గొడ్డలి సాయంతో పగులగొట్టాడు.ఆ తర్వాత అక్కడ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘‘ఐఎస్ఐఎస్’’ పేరును స్ప్రే చేశాడు.అయితే బుధవారం కోర్ట్ విచారణ సందర్భంగా శివప్రకాశ్ మౌనంగా వున్నట్లు వార్తాకథనం తెలిపింది.పేదలు, అణచివేతకు గురైన వారి నుంచి ఎదురుదెబ్బలు తగలవచ్చని ప్రభుత్వానికి సంకేతాలు ఇవ్వడానికి శివప్రకాశ్ ఇలా చేశారని ప్రాసిక్యూటర్ కోర్ట్‌కు తెలిపారు.

సబ్ వే సమీపంలోని పోలీస్ పోస్ట్‌లో మంటలు చెలరేగగా.అక్కడికి సమీపంలో నేల మీద కూర్చొని వున్న శివప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube