కరోనా... కరోనా అంటూ కేకలు, ఫ్లోర్‌పై ఉమ్ము: సింగపూర్‌లో భారతీయుడికి జైలు శిక్ష

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.వచ్చే రెండు, మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నాయి.

 Indian Origin, Singaporean, Corona, Jail-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఫిలిప్పిన్స్ ప్రభుత్వం ఇళ్లు దాటి బయటకు వచ్చిన వారిని కాల్చేపారేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఇక సింగపూర్ ప్రభుత్వం సైతం లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.

ఈ విషయం తెలియక ఓవరాక్షన్ చేసిన భారతీయుడు కటకటాల పాలయ్యాడు.చాంగీ ఎయిర్‌పోర్టు హోటల్‌లో బస చేస్తున్న జస్వీందర్ సింగ్ మెహర్ సింగ్ ఏదో పిచ్చి పట్టునట్లుగా కారిడార్‌లో ‘‘కరోనా, కరోనా’’ అంటూ కేకలు వేశాడు.

అంతేకాకుండా హోటల్ ఫ్లోరింగ్ మీద ఎడా పెడా ఉమ్మి వేశాడు.

Telugu Corona, Indian Origin, Jail, Singaporean-

ఇంత జరగడానికి అసలు కారణం జస్వీందర్ సింగ్ ఎయిర్‌పోర్టులోని అజర్ రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వెళ్లగా హోటల్ సిబ్బంది తినుబండారాల విభాగం మూసివేసినట్లు చెప్పడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.ఆ వెంటనే చేతిలోని ప్లేటును విసిరికొట్టాడు.ఆ వెంటనే ఫ్లోర్‌పై పోర్లాడాడని .ఖాళీ ప్లేట్లను, టేబుళ్లను చిందరవందర చేశాడని సిబ్బంది చెప్పారు.దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి రెండు నెలల జైలు శిక్ష విధించింది.కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం ఈ తరహా నేరం ఇదేనని ఓ సింగపూర్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

మరోవైపు వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై జస్వీందర్ సింగ్‌ ఈ ఏడాది జనవరిలోనూ జైలు శిక్ష అనుభవించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube