దొంగతనం, పోలీసులతో దురుసు ప్రవర్తన : సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష

Indian Origin Singaporean Jailed And Fined For Abusing Police Theft And Drug Possession

డ్రగ్స్ సేవించడం, దొంగతనం, పోలీసులతో దురుసుగా వ్యవహరించిన కేసులో భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్ట్ జైలు శిక్ష విధించినట్లు ది స్ట్రయిట్స్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.మొత్తం 9 అభియోగాలకు గాను 8 నెలల జైలు శిక్షతో పాటు 5,500 సింగపూర్ డాలర్ల జరిమాను సైతం విధించింది.

 Indian Origin Singaporean Jailed And Fined For Abusing Police Theft And Drug Possession-TeluguStop.com

నిందితుడిని 47 ఏళ్ల క్లారెన్స్ సెల్వరాజుగా గుర్తించారు.ఇతను కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు నేరాలను అంగీకరించాడు.అంతేకాదు తాను బయటకు వచ్చినప్పుడు .మిమ్మల్ని గుర్తుపెట్టుకుని కలుస్తాను’’ అంటూ పోలీసులకు కోర్టు వెలుపలే వార్నింగ్ ఇచ్చాడు.దీనికి గాను సెల్వరాజ్ అదనంగా 22 రోజులు జైలు శిక్షను అనుభవించాల్సి వుంటుంది.,/br>

ఈ ఏడాది మార్చి 7న క్లారెన్స్ సెల్వరాజ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి బీరు తాగుతూ ఓ సూపర్ మార్కెట్ వద్ద పెద్ద కేకలు, వింత శబ్ధాలు చేస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.

 Indian Origin Singaporean Jailed And Fined For Abusing Police Theft And Drug Possession-దొంగతనం, పోలీసులతో దురుసు ప్రవర్తన : సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిపై తమకు సమాచారం అందడంతో ముగ్గురు పోలీస్ అధికారులు రాత్రి 9 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు.దూరం నుంచి వారిని గమనించిన క్లారెన్స్ తనకు మాస్క్ లేదని గుర్తించాడు.

దానిని సరిగా పెట్టుకోవాలని పోలీసులు సూచించడంతో క్లారెన్స్ సదరు అధికారితో వాగ్వాదానికి దిగినట్లు డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిదాయత్ అమీర్ కోర్టుకు తెలిపారు.

దీంతో క్లారెన్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని బ్యాగ్‌లో 11 గ్రాముల సైకోయాక్టివ్ పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీనితో పాటు సింథటిక్ డ్రగ్‌ను వినియోగించే ఒక పాత్రను కూడా గుర్తించారు.అనంతరం క్లారెన్స్‌ను అదుపులోకి తీసుకుని వుడ్‌ల్యాండ్స్ పోలీస్ డివిజన్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు పోలీసులు.స్టేషన్‌కు వచ్చిన వెంటనే .కారులో తన పక్కన కూర్చొన్న అధికారులలో ఒకరిపై ఉమ్మడంతో పాటు మోకాలితో నెట్టాడు.దొంగతనం, డ్రగ్స్ సంబంధిత నేరాలకు సంబంధించి క్లారెన్స్ గతంలో 18 ఏళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించినట్లు ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.

#Singapore #Straits Times #Theft Drug #IndianOrigin #Synthetic Drug

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube