సింగపూర్‌లో ఏడుగురు భారతీయులకు కరోనా: ఆ షాపింగ్ కాంప్లెక్సే‌ కరోనా క్లస్టర్‌

ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తుంటే దానినే వణికిస్తున్న దేశం సింగపూర్.విపత్తులను, హెల్త్ ఎమర్జెన్సీలపై ముందుగానే గుర్తించే ఈ దేశం కరోనాను కూడా ధైర్యంగా ఎదుర్కొంది.

 Indian Origin Singapore Complex, Coronavirus Cluster, Singapore, Shopping Comple-TeluguStop.com

ప్రజలకు వైద్య పరీక్షలు చేసి, అనుమానితులను హాస్పిటల్‌లో చికిత్స అందించింది.ప్రజలు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లినట్లయితే వారికి భారీ జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నారు అక్కడి అధికారులు.

ఈ నేపథ్యంలో గురువారం ఏడుగురు భారతీయులు సహా 49 కొత్త కేసులు నమోదు కావడంతో సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది.ముస్తఫా సెంటర్‌లో 24 గంటల పాటు నడిచే భారత సంతి షాపింగ్ కాంప్లెక్స్‌ను కరోనా వైరస్ క్లస్టర్‌గా గుర్తించింది.

పాజిటివ్‌గా వచ్చిన భారతీయులలో ఆరుగురు పురుషులు కాగా, ఒకరు మహిళ.వీరంతా 25 ఏళ్ల నుంచి 41 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే.గురువారం చోటు చేసుకున్న కేసులతో కరోనా కేసుల సంఖ్య 1,049కి చేరింది.

Telugu Indianorigin, Complex, Singapore-

కొత్త వాటిలో 41 కేసులు స్థానికంగా వ్యాపించినవేనని తెలుస్తోంది.మిగిలిన 8 కేసులు… యూరప్, నార్త్ అమెరికా, ఆసియా దేశాల నుంచి వచ్చిన వారికి సోకినవి.కొత్తగా ధృవీకరించబడిన ఐదు కేసులు .ఆరు పాత కేసులతో లింక్ ఉన్నవే.కాగా ముస్తఫా సెంటర్‌లో సింగపూర్ ప్రభుత్వం కరోనా క్లస్టర్‌గా గుర్తించిన షాపింగ్ కాంప్లెక్స్.

భారతీయ సమాజంలో అత్యంత ప్రాచుర్యం పొందినది.కాంటాక్ట్ ట్రేసింగ్ నేపథ్యంలో గతంలో ప్రకటించిన కేసులు, కొత్త కేసుల మధ్య అధికారులు లింక్ కనుగొంటున్నారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 464 మంది కరోనా రోగుల ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని, 23 మంది పరిస్ధితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube