అమెరికా: భారత సంతతి సిక్కు క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. పంజాబీ కమ్యూనిటీ ఆగ్రహం

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

 Indian-origin Sikh Taxi Driver Assaulted, His Turban Knocked Off By Unidentified-TeluguStop.com

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

తాతలు తండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూనే వుంటారు.సిక్కులు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది వారి ఆహార్యంలోని ‘తలపాగా’.

చూడటానికి ఆకర్షణీయంగా.అందంగా, హుందాగా ఉంటుంది ఈ తలపాగా.

అయితే దురదృష్టవశాత్తూ సిక్కులు విదేశాలలో విద్వేషదాడులకు బాధితులుగా మారుతున్నారు.

అసలు విషయంలోకి వెళితే.

అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు.ఈ ఘటనలో నిందితుడు.

సిక్కు వ్యక్తి తలపాగాను లాగి కిందపడేశాడు.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

అయితే జనవరి 4న ఓ వీడియోను నవజ్యోత్ పాల్ కౌర్‌ అనే మహిళ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.ఇందులో బాధితుడిని పదే పదే కొట్టడం, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తలపాగాను లాగడం కనిపిస్తోంది.

జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తుతెలియని వ్యక్తి ఈ వీడియో తీశాడని… దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదని నవజ్యోత్ తెలిపారు.అయితే మన సమాజంలో ద్వేషం కొనసాగుతుందన్న వాస్తవాన్నిహైలైట్ చేయాలనుకుంటున్నానని ఆమె చెప్పారు.దురదృష్టవశాత్తు సిక్కు క్యాబ్ డ్రైవర్లపై పదే పదే దాడులు జరగడాన్ని తాను చూశానని నవజ్యోత్ కౌర్ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పంజాబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.ఈ ఘటనకు దారి తీసిన కారణాలు, బాధితుడి వివరాలు తెలియరాలేదు.

అమెరికాలో సిక్కు క్యాబ్ డ్రైవర్లపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు.భారత సంతతికి చెందిన సిక్కు ఉబెర్ డ్రైవర్‌పై 2019లో వాషింగ్టన్‌లో విద్వేషపూరిత దాడి జరిగింది.అంతేకాదు నిందితులు అతనిపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడారు.2017లో న్యూయార్క్‌లో జరిగిన ఘటనలో 25 ఏళ్ల సిక్కు క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన అతని తలపాగాను లాగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube