ఆర్థరైటీస్‌ మందులతో కరోనా రోగుల్లో సత్ఫలితం: భారత సంతతి రీసెర్చ్ బృందం ప్రయోగం

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే కొన్ని చోట్ల క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి.

 Indian-origin Scientists Find Novel Way To Treat Severe Covid-19 In Us, Covid-1-TeluguStop.com

ఈ నేపథ్యంలో రుమటాయిడ్ ఆర్థరైటీస్‌తో పాటు పలు వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఇంటర్‌లుకిన్-6 డ్రగ్, సరిలుమాబ్ లేదా టోసిలిజుమాబ్ తీసుకున్న కరోనా రోగులు మెరుగైన ఫలితాలను పొందినట్లు అమెరికాలో భారత సంతతి పరిశోధకుల బృందం చేసిన రీసెర్చ్‌లో తేలింది.

మరణాల రేటు, ఇంట్యూబేషన్ అవసరాన్ని తగ్గించడంలో ఇవి మరింత ప్రభావవంతంగా పనిచేస్తోందని వారు తెలిపారు.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను ప్రచురించారు.కరోనా చికిత్సలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెమిడిసివిర్, డెక్సామెథాసోన్‌ సహా ఇతర ప్రత్యామ్నాయాలతో పోల్చి చూసినప్పుడు ఇంటర్‌లుకిన్-6 ఇన్హిబిటర్లు మెరుగైన చికిత్సా విధానంగా కనిపిస్తున్నాయని ఈ బృందం అభిప్రాయపడింది.

కోవిడ్ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్న సమయంలో తమ రీసెర్చ్ మెరుగైన పరిష్కారాలను అందిస్తుందని బోస్టన్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన మనీష్ సాగర్ చెప్పారు.

వీరి అధ్యయనం ప్రకారం.

ఎలివేటెడ్ ఐఎల్ 6ఆర్ఐ ఔషధం తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ లేదా కోవిడ్ సంక్రమణ ఉన్న రోగులలో సంభవించే సిస్టెమిక్ ఇన్‌ఫ్లెమ్మెటరీ రెస్పాన్స్‌ను మిడియేట్ చేస్తుంది.దాదాపు 255 కోవిడ్ 19 రోగులు, 2బీ దశలో (149 మంది రోగులు), మూడవ దశలో (106 మంది రోగులు), ఐఎల్‌6ఆర్ఐతో చికిత్స పొందుతున్నారు.ఐఎల్6ఆర్ఐ మొదట్లో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మాత్రమే కేటాయించారు.కానీ సమీక్ష తర్వాత తక్కువ ఆక్సిజన్ అవసరమున్న రోగుల కోసం మరింత సరళీకృతం చేశారు.

Telugu America, Covid Rates, Covid, Indianorigin, Interleukin-

శాంప్లింగ్ విత్ రిప్లేస్‌‌మెంట్ అనాలిసిస్‌లో ఐఎల్6ఆర్ఐని పొందిన రోగులు రెమిడిసివర్, డెక్సామెథాసోన్ ట్రయల్స్ తీసుకున్న వారికంటే తక్కువ మరణాల రేటును కలిగి వున్నారని తేలింది.కరోనాలోని కీలకమైన శ్వాసకోశ క్షీణత దశకు ముందు ఐఎల్6ఆర్ఐ ఔషధాన్ని పొందిన రోగులలో మంచి ప్రయోజనం కనిపించిందని మరో పరిశోధకుడు ప్రణయ్ సిన్హా చెప్పారు.కోవిడ్ మరణాల రేటును, ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి తమ పరిశోధనలు వైద్యులకు మార్గనిర్దేశం చేస్తాయని ఆశిస్తున్నామని సిన్హా అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube