భారతీయుడి ప్రస్థానం : సేల్స్ మెన్ స్థాయి నుంచీ యూఏఈ గోల్డెన్ వీసా వరకూ...!!

భారత్ నుంచీ పొట్ట చేత బట్టుకుని, ఉన్నతమైన ఉద్యోగాల కోసం, అత్యధికంగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఎంతో మంది యూఎఈ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.అలా వెళ్ళిన ఓ భారత సంతతి వ్యక్తి అబుదాబితో సాధారణ సేల్స్ రిప్రజన్టేట్ గా తన జీవితం మొదలు పెట్టి ఆనతి కాలంలోనే ధనవంతుడుగా, గొప్ప బిజినెస్ మ్యాన్ గా వేలాది మందికి ఉపాది కల్పించే స్థాయికి ఎదిగారు.

 Indian Origin Businessman Satish Jaisinghani Gets Uae Golden Visa, Uae Golden Vi-TeluguStop.com

అంతేకాదు అబుదాబి లో ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.అందుకే తమ దేశానికి సదరు భారతీయుడు చేసిన సేవలకు గాను యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో సత్కరించింది.

భారత దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకరైన సతీష్ జై సింఘానీ 1984 లో యూఏఈ వెళ్ళారు.అక్కడ ఓ ప్రింటింగ్ ప్రెస్ లో తన ఉద్యోగాన్ని మొదలు పెట్టి వివిధ కార్పోరేట్ సంస్థలలో దాదాపు 17 ఏళ్ళ పాటు పనిచేశారు.

అదే అనుభవంతో 2000 సంవత్సరంలో ఫ్రైడ్ ట్రేడింగ్ పేరుతో సంస్థను మొదలు పెట్టి ఊహించని విధంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు.అక్కడ నుంచీ ఇక తిరిగి చూసుకోలేదు టెక్స్ట్ టైల్స్ , గార్మెంట్స్ ఇలా ఎన్నో రకాల బిజినెస్ లు మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.

ఆ తరువాత ఇంటర్నేషనల్ యూనిఫార్మ్స్ అనే సంస్థను ప్రారంభించి దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులకు యూనిఫార్మ్స్ తయారు చేయడంలో ప్రఖ్యాతి గాంచారు.

తరువాత కొడుకులు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల వైపు మళ్ళకుండా వారితో వారి వారి చదువులకు తగ్గట్టుగా ప్రముఖ వ్యాపారాలు పెట్టించారు.

వారు కూడా యూఏఈ లో టాప్ ప్లేస్ బిజినెస్ మెన్స్ గా మారడమే కాకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఇలా వారికి ఉన్న ఎన్నో సంస్థల్లో వేలాది మంది ఉపాది పొందుతున్నారు.

దాంతో ఆయన సేవలను గుర్తించిన యూఏఈ ప్రభుత్వం 10 ఏళ్ళ కాలపరిమితితో కూడిన అరుదుగా ఇచ్చే గోల్డెన్ వీసాను అందించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube