మహిళలే టార్గెట్: యూకేలో భారత సంతతి ‘రొమాంటిక్ మోసగాడి’కి జైలు శిక్ష  

Indian-Origin "Romance Fraudster" Jailed For Over 4 Years In UK, Romance Fraudster,UK, UK Court, Cheating Girls, Love Affair,traping - Telugu Cheating Girls, Indian-origin \"romance Fraudster\" Jailed For Over 4 Years In Uk, Love Affair, Romance Fraudster, Uk, Uk Court

ఆన్‌లైన్ డేటింగ్‌ యాప్‌లో ‌అమ్మాయిలను ట్రాప్ చేసి వారి చేత నకిలీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన రొమాంటిక్ మోసగాడికి యూకే కోర్టు జైలు శిక్ష విధించింది.

TeluguStop.com - Indian Origin Romantic Fraud Arrested

ఆగ్నేయ లండన్‌లోని స్లౌగ్‌కు చెందిన విమల్ పోపాట్ (41) ఈ కేసు విచారణలో భాగంగా హారో క్రౌన్ కోర్టుకు హాజరయ్యాడు.

ఉద్దేశ్యపూర్వకంగా 4,40,000 పౌండ్ల మేర బాధితులకు టోకరా వేశాడు.విమల్ తన బాధితులను జంబుల్ వంటి డేటింగ్ సైట్‌ల ద్వారా కలుసుకున్నాడు.
ఇలాంటి మోసాలకు గురైన వారు సహాజంగానే పోలీసులను ఆశ్రయించలేరని, అమాయకత్వానికి తోడు.పరువు పోతుందనే భయంతో బాధితులు ముందుకు రాలేరని పోలీసులు చెబుతున్నారు.అయితే పోపాట్ వంటి కేటుగాళ్లు ఉద్దేశ్యపూర్వకంగా మాయమాటలతో ఓ పథకం ప్రకారం వ్యవహారిస్తారని తెలిపారు.అలాంటి పరిస్ధితుల్లో బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మెట్రోపాలిటిన్ పోలీస్ వర్గాలు అభినందిస్తున్నాయి.

TeluguStop.com - మహిళలే టార్గెట్: యూకేలో భారత సంతతి ‘రొమాంటిక్ మోసగాడి’కి జైలు శిక్ష-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తద్వారా పోపాట్ నేరాలకు అడ్డుకట్టపడిందని, మరింతమంది అతని పథకాలకు బలైపోకుండా జరిగిందని వారు అభిప్రాయపడ్డారు.
విమల్ ట్రాప్‌లో పడిన మొత్తం ఎనిమిది మంది బాధితుల్లో ఆరుగురు మహిళలే.

వీరిలో నలుగురిని పోపాట్ తనతో లైంగిక చర్యలో పాల్గొనాల్సిందిగా ఒప్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఆన్‌లైన్ డేటింగ్ సైట్ ద్వారా తొలుత విమల్ స్నేహం చేస్తాడు.ఆ తర్వాత తన ట్రాప్‌లో పడినవారితో శృంగార సంబంధాలను ఏర్పరచుకుంటాడు.ఇక తన మాయలో పూర్తిగా పడ్డారని భావించిన తర్వాత విమల్ వారిని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాల్సిందిగా ఒప్పించేవాడు.
తనను తాను విజయవంతమైన ఫారెక్స్ వ్యాపారి అని చెప్పుకుంటూ విమల్ బాధితులను మోసం చేశాడు.వారి వద్ద నుంచి డబ్బు తీసుకున్న తర్వాత దానితో కాసినోలలో జూదం ఆడేవాడు.తన వద్ద డబ్బు సురక్షితంగా ఉందని నమ్మించడానికి పోపాట్ నకిలీ బ్యాంక్ పత్రాలను కూడా సృష్టించాడు.2013లో ఈ తరహా నేరాలకు తెరదీసిన విమల్ 2015-16 మధ్య ఆపేశాడు.అయితే 2019లో ఒకేసారి నలుగురు బాధితులను మోసం చేసినప్పుడు అతని నేరాల తీవ్రత పెరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో ఉత్తర లండన్‌లోని హెండన్ వద్ద ఉన్న ఎకనామిక్ క్రైమ్ యూనిట్ నుంచి మెట్ పోలీసులను పోపాట్‌ను అరెస్ట్ చేశారు.

ఆ మరుసటి రోజే అతనిపై అభియోగాలు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.దీనికి సంబంధించి విమల్‌ను దోషిగా నిర్థారించిన న్యాయస్థానం అతనికి నాలుగేళ్ల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.

#Cheating Girls #UK Court #Love Affair

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Romantic Fraud Arrested Related Telugu News,Photos/Pics,Images..