బ్రిటన్ ప్రధాని పీఠంపై మన భారతీయుడు..???

బ్రిటన్ దేశానికి మన భారత సంతతి వ్యక్తి ప్రధాని కాబోతున్నాడా, ఒకానొక సమయంలో భారత్ పై దాడి చేసి వందల ఏళ్ళు ఏలి, యావత్ భారత దేశాన్ని దోచుకున్న దేశానికి ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.అందరి అంచనాలని తలకిందులు చేస్తూ భారత సంతతికి చెందిన ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వంలో అత్యంత కీలక భాద్యతలలో ఉన్న ఆ దేశ మంత్రి, రిషి సునక్ కు బ్రిటన్ పదాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

 Indian-origin Rishi Sunak Front-runner For Britain’s Pm Post, Rishi Sunak, Bri-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.

గడిచిన కొన్ని రోజులుగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవి నుంచీ దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్న విషయం విధితమే.

గడిచిన ఏడాది కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ ఇచ్చి అందరిని ఆహ్వానించారు.అదే సమయంలో దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది.

ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రధానే భాద్యతారాహిత్యంగా ఉన్నాడంటూ ప్రతిపక్షాలతో పాటు స్వపక్షాలు కూడా ఆందోళన చేపట్టాయి.అసలు బోరిస్ ప్రధానిగా ఉండటానికి అర్హుడు కాదంటూ డిమాండ్ చేశారు.

ఈ నేపధ్యంలో అక్కడ రాజకీయ పరిస్థితులను అంచనా వేసిన పరిశీలకులు త్వరలో బోరిస్ పదవి నుంచీ తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.అదే గనుక జరిగితే…

బ్రిటన్ ప్రధాని పీటంపై భారత సంతతికి చెందిన రిషి సునక్ కు ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.ఇప్పటికే రిషి బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా అత్యంత కీలక పదవిలో ఉన్న విషయం తెలిసిందే.అన్ని సమీకరణాలు రిషికి అనుకూలంగా ఉన్నాయని ఆయన ప్రధాని భాద్యతలు చేపట్టడానికి మెజారిటీ ప్రజలకు ఎలాంటి అభ్యంతరం ఉండదని అంచనా వేస్తున్నారు.

ఈ పదవికోసం ఇప్పటికే విదేశాంగ శాఖామంత్రి లిజ్ ట్రస్ , క్యాబినెట్ మంత్రి మిచెల్, హోమ్ మంత్రి ప్రీతి పటేల్ మరో కొందరు పోటీ పడుతుండగా రిషి సునక్ వారందరికంటే ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube