బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నిక : రిషి సునక్, సుయెల్లా బ్రేవర్‌మెన్‌లపై జాత్యహంకార వ్యాఖ్యలు

బోరిస్ జాన్సన్ రాజీనామాతో బ్రిటన్ లో కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది.ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటైన బ్రిటన్ కు ప్రభుత్వాధినేతగా వ్యవహరించేందుకు అనేక మంది పోటీలో నిలిచారు.

 Indian Origin Rishi Sunak And Suella Braverman Subjected To Racist Onslaught In-TeluguStop.com

ఈ క్రమంలో భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ ఎంపీలు రిషి సునక్, సుయెల్లా బ్రేవర్‌మెన్ లు సైతం బరిలో నిలిచారు.ఈ మేరకు వీరిద్దరూ అధికారికంగా బిడ్ దాఖలు చేశారు.

వీరిలో రిషి సునక్ అందరికన్నా ముందున్నారు.ఇప్పటికే ఆయనకు పలువురు టోరీ ఎంపీలు, నేతలు మద్ధతు ప్రకటించారు.

వీటన్నింటికి తోడు ప్రధాన మంత్రి పోటీలో తొలి నుంచి వున్న రక్షణ మంత్రి బెన్ వాలెస్ బరిలో నుంచి తప్పుకుంటూ రిషికి మద్ధతు ప్రకటించడం అదనపు బలంగా మారింది.దీంతో రిషికి ఎదురయ్యే పోటీ నామమాత్రంగా వుండే అవకాశం వుందని బ్రిటన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే భారతీయ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ అత్యున్నత పదవికి చేరువగా వస్తుండటాన్ని జీర్ణించుకోలేని కొందరు పనిగట్టుకుని మరి దుష్ప్రచారం చేస్తున్నారు.ముఖ్యంగా బోరిస్ జాన్సన్ వర్గీయులుగా వున్న కొందరు రిషి సునక్ పై విమర్శలు చేస్తున్నారు.

మాజీ బాస్ కు వ్యతిరేకంగా కుట్రపన్నారంటూ ఆరోపిస్తున్నారు.పార్టీ గేట్, పన్ను ఎగవేత (సునక్ భార్య అక్షతను ప్రస్తావిస్తూ) , వలస నేపథ్యం, ట్రెజరీ ఛాన్సలర్‌గా వున్నప్పుడు కొంతకాలం యూఎస్ గ్రీన్ కార్డు కలిగి వున్న విషయాలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Telugu Britain, Pm, Racist, Readyrishi, Rishi Sunak, Uk-Telugu NRI

అంతేకాదు.సునక్ తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన వెంటనే.రైట్ వింగ్ వెబ్‌సైట్ గైడో ఫాక్స్. “Ready4Rishi.com” అనే డొమైన్ పేరు జూలై 6న రాత్రి 10.30 గంటలకు జాన్సన్ నిష్క్రమించే ముందే క్రియేట్ చేశారని ట్వీట్‌లో పేర్కొంది.సునక్ కుటుంబానికి వందల మిలియన్ల ఆస్తులు వున్నాయని.

కానీ పన్నులను మాత్రం చెల్లించరని లేబర్ ఎంపీ రిచర్డ్ బర్గాన్ ట్వీట్ చేశారు.మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వేడి చేసుకోవడానికి కష్టపడుతుంటే .సునక్ మాత్రం తన కొత్త పూల్ ను వేడి చేయడానికి 13,000 పౌండ్లు (భారత కరెన్సీలో రూ.12 లక్షలు) వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇకపోతే.యూకే అటార్నీ జనరల్ బ్రేవర్‌మెన్ శనివారం అధికారికంగా తన బిడ్ ను ప్రకటించారు.దీంతో ఆమెపైనా ట్రోలింగ్ మొదలైంది.మా తదుపరి ప్రధాన మంత్రి సుయెల్లా బ్రేవర్‌మెన్ .? ఆమెకు భయపడాలంటూ బ్రిటీష్ సిక్కు పాత్రికేయుడు సన్నీ హుండాల్ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube