ప్లాస్టిక్‌పై పోరాటం.. స్టీల్ బాక్సుల్లో పార్శిల్: భారత సంతతి రెస్టారెంట్ వినూత్న ఆలోచన

పర్యావరణం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో ఒక రెస్టారెంట్‌ను నడుపుతున్న భారత సంతతి వ్యక్తికి వినూత్నమైన ఆలోచన వచ్చింది.పార్శిల్ తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ బాక్సులకు బదులు పాత కాలం నాటి స్టీల్ బాక్సులను ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు.1960ల ప్రాంతంలో భారత్‌లోని పంజాబ్ నుంచి వలస వచ్చి ఉత్తర ఇంగ్లాండ్‌లో స్థిరపడిన హ్యారీ ఖిండా అక్కడ ‘‘ ది క్రాఫ్టీ ఇండియన్ రెస్టారెంట్’’ ను నడుపుతున్నారు.

 Indian Origin Restaurant Uses Steel Tiffin Boxes On Recycling Mission In Uk-TeluguStop.com

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంటైనర్లు, క్యారియర్ బ్యాగ్స్ వాడటం వల్ల ప్రకృతికి జరుగుతున్న నష్టం తమను ఆలోచింపజేసిందని హ్యారీ తెలిపారు.

అతి పెద్ద జనాభా ఉన్న దేశం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఏనాటి నుంచో ప్రయత్నం చేస్తుందన్నారు.ప్లాస్టిక్ సమస్యకు సమాధానం చాలా దశాబ్ధాలుగా మనం చూస్తూనే ఉన్నాం.

అదే టిఫిన్ బాక్స్.ఈ ఆలోచన తన తల్లిదండ్రుల నుంచి వచ్చిందని ఖిండా తెలిపాడు.

Telugu Indian, Indianorigin, Restaurant, Steel, Telugu Nri, Tiffin Boxes-Telugu

తన కుటుంబం 1960లలో యూకేకు వచ్చినప్పుడు వారు తమతో పాటు స్టీల్ టిఫిన్ బాక్సులను వారితో తీసుకువచ్చారని హ్యారీ చెప్పాడు.ఉత్తర ఇంగ్లాండ్‌లోని కర్మాగారాల్లో పనిచేయడానికి వెళ్లేటప్పుడు వారు భోజనాన్ని టిఫిన్ బాక్సుల్లోనే ప్యాక్ చేసుకునేవారని అతను గుర్తు చేసుకున్నాడు.ఈ విధానం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోందని ఖిండా తెలిపాడు.ఈ పద్ధతిని ఇతను బ్రాడ్‌ఫోర్డ్‌ షిప్లీలోని తన రెస్టారెంట్‌లో ప్రవేశపెట్టాడు.దీనికి కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఇంకా ప్రొత్సహించేందుకు గాను 10 శాతం డిస్కౌంట్ ఇచ్చాడు.

Telugu Indian, Indianorigin, Restaurant, Steel, Telugu Nri, Tiffin Boxes-Telugu

ఈ బాక్సులను హ్యారీ భారత్ నుంచి దిగుమతి చేసుకునేవాడు.అయితే ఒకసారి వీటిని తీసుకున్న వారు మరోసారి రెస్టారెంట్‌కు వచ్చేటప్పుడు పాత కంటైనర్లను తీసుకురావాలని సూచించాడు.ఈ రెస్టారెంట్‌ను ఖిండా 2008లో నెలకొల్పాడు.

దీనికి స్థానికులు, భారతీయ సమాజం నుంచి మంచి ఆదరణ లభించింది.భారతీయ ఆహారానికి యూకేలో మంచి జనాదరణ ఉంటుంది.

స్ట్రీట్ ఫుడ్‌లో ఈ అద్భుతమైన వంటకాలను భాగం చేసి టిఫిన్ బాక్సుల్లో ప్యాకేజింగ్ చేయడం వలన భారతీయ ఆహారానికి బ్రాండింగ్ చేయవచ్చని హ్యారీ అభిప్రాయపడ్డారు.ప్లాస్లిక్ వాడకాన్ని తగ్గించడంలో ఇతర రెస్టారెంట్లు కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తాయని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube