లంచం ఆరోపణలపై భారత సంతతి మేనేజర్ సింగపూర్‌లో కటకటాల పాలయ్యాడు.తన ప్రాజెక్ట్‌ను సజావుగా సాగించినందుకు గాను ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్‌కు 33,513 సింగపూర్ డాలర్లను నిందితుడు లంచంగా ఇచ్చినట్లు రుజువవ్వడంతో.
సింగపూర్ న్యాయస్థానం అతనికి సోమవారం ఏడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
నిందితుడిని గనిశన్ సుప్పయ్యగా (52)గా గుర్తించారు .ఇతను పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు (పీయూబీ) అసిస్టెంట్ ఇంజనీర్ జమాలుద్దీన్ మొహమ్మద్‌కు లంచం ఇచ్చినట్లు తేల్చారు.జమాలుద్దీన్ అతనికి నకిలీ ఇన్‌వాయిస్ తయారుచేసి ఇచ్చాడని న్యూస్ ఆసియా ఛానెల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది.
నేరాలు జరిగిన సమయంలో గనిశన్.పైప్ వర్క్స్, క్రిష్‌కో సింగపూర్ కన్‌స్ట్రక్షన్ రెండింటికీ ప్రాజెక్ట్ మేనేజర్‌గా వున్నట్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రాజెక్ట్‌కు అవసరమైన వస్తువుల కొనుగోలు, మానవ వనరులు, పరికరాల నిర్వహణ వంటి అంశాను గనిశన్ పర్యవేక్షించాడు.
ఇక జమాలుద్దీన్ (58) .పీయూబీ నీటి సరఫరా డిపార్ట్‌మెంట్‌లోని నెట్‌వర్క్ పునరుద్దరణ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.థర్డ్ పార్టీ సైట్‌లలో పీయూబీ టర్మ్ కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు చేసే నీటి మళ్లింపు పనులను జమాలుద్దీన్ పర్యవేక్షించాడు.
ఈ క్రమంలో గనిశన్‌ని జమాలుద్దీన్ సంప్రదించి.ప్రాజెక్ట్ పనుల వ్యవహారాలను సులభతరం చేయడంలో సాయం చేస్తానని ఇందుకు గాను ‘‘పర్యవేక్షణ రుసుము’’ పేరిట లంచాన్ని కోరాడు.
ఇందుకు గనిశన్ స్పందిస్తూ.ప్రధాన కాంట్రాక్టర్లకు బిల్ చేసిన పైప్ వర్క్స్ ఇన్‌వాయిస్‌లపై వున్న మొత్తాలలో 2 నుంచి 5 శాతం వరకు పనుల వ్యవధిని బట్టి చెల్లిస్తానని అంగీకరించాడు.
మరోవైపు తప్పుడు ఇన్‌వాయిస్‌ల ద్వారా డబ్బును స్వీకరించేందుకు వీలుగా జమాలుద్దీన్ ఒక కంపెనీని ఏర్పాటు చేశాడు.
ఈ క్రమంలో నవంబర్ 2017 నుంచి 2018 మధ్యకాలంలో జమాలుద్దీన్‌కి గనిశన్ 45,169 సింగపూర్ డాలర్లు ఇచ్చినట్లు ఛానెల్ తెలిపింది.అయితే నకిలీ ఇన్‌వాయిస్‌ల గురించి గనిశన్ పై అధికారికి తెలియదు.2019లో పీయూబీ టెండర్ కోసం బిడ్ దాఖలు చేసిన కంపెనీ నుంచి 5,00,00 డాలర్ల లంచం పొందేందుకు కూడా జమాలుద్దీన్ ప్రయత్నించినట్లు సింగపూర్ అవినీతి వ్యవహారాల దర్యాప్తు సంస్థ (సీపీఐబీ) విచారణలో తేలింది.తప్పుడు ఇన్‌వాయిస్‌లు చేయడానికి జమాలుద్దీన్‌తో కలిసి గనిశన్ నేరాన్ని ప్రోత్సహించినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.పర్యవేక్షణ రుసుము స్వీకరించే ఉద్దేశ్యంతో జమాలుద్దీన్ ఈ తప్పుడు ఇన్‌వాయిస్‌ను గనిశన్‌కు ఇచ్చాడు.
ఈ కుట్రకు సంబంధించి గతేడాది నవంబర్‌లో జమాలుద్దీన్‌కు 9 నెలల 10 వారాల జైలుశిక్ష 45,169 డాలర్లు జరిమానా విధించింది.