McGill University Prof H Deep Saini : కెనడాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా భారతీయుడు..!!

కెనడాలోని ప్రతిష్టాత్మక మెక్‌గిల్ యూనివర్సిటీలో భారతీయుడికి కీలక పదవి దక్కింది.భారత సంతతికి చెందిన ప్లాంట్ ఫిజియాలజిస్ట్ ప్రొఫెసర్ హెచ్ దీప్ సైనీ మెక్‌గిల్ యూనివర్సిటీకి ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు.

 Indian Origin Prof H Deep Saini Appointed As Vice-chancellor Of Mcgill Universit-TeluguStop.com

దాదాపు 10 వేలకు పైగా విదేశీ విద్యార్ధులకు ఈ యూనివర్సిటీ నిలయంగా వుంది.వీరిలో భారతీయులు 27 శాతంపైనే.అంతర్జాతీయంగానూ ఈ యూనివర్సిటీకి మంచి గుర్తింపు వుంది.2023 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మెక్‌గిల్‌కు 31వ స్థానం దక్కగా.కెనడాలో అగ్రస్థానంలో వుంది.టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రచురించిన గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ 2020లో మెక్‌గిల్ ప్రపంచంలో 23వ స్థానంలో, కెనడాలో రెండవ స్థానంలోనూ నిలిచింది.

ప్రస్తుతం నోవాస్కోటియాలోని హాలిఫాక్స్‌లో వున్న డల్హౌసీ యూనివర్సిటీకి ప్రెసిడెంట్, వైస్ ఛాన్సలర్‌గా సైనీ వ్యవహరిస్తున్నారు.ఏప్రిల్ 1, 2023లో ఆయన మెక్‌గిల్‌ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పదవిలో దీప్ సైనీ ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.దీనితో పాటు అగ్రికల్చర్ , ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లోనూ పూర్తి స్థాయి ప్రొఫెసర్‌గానూ ఆయన నియమితులయ్యారు.

Telugu Canada, Indian Origin, Ludhiana, Mcgill, Prof Deep Saini, Chancellor-Telu

భారతదేశంలో పుట్టి పెరిగిన దీప్ సైనీ లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి బోటనీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) పూర్తి చేశారు.అనంతరం ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ యూనివర్సిటీ నుంచి ప్లాంట్ ఫిజియాలజీలో పీహెచ్‌డీని అందుకున్నారు.కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ తర్వాత.ఆయన యూనివర్సిటీ డీ మాంట్రియల్‌లో చేరారు.రెండు దశాబ్ధాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన సైనీ.అనంతరం వాటర్లూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ డీన్‌గా, టొరంటో యూనివర్సిటీ మిస్సిసాగా క్యాంపస్‌కు వైస్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.2016లో సైనీ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లి కాన్‌బెర్రా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్, ప్రెసిడెంట్‌గా వున్నారు.ఆయన పదవీ కాలంలో కాన్‌బెర్రా యూనివర్సిటీ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 500లో టాప్ 200కి చేరుకుంది.

తర్వాత తిరిగి కెనడాకు వచ్చేసిన సైనీ డల్హౌసీ యూనివర్సిటీ పగ్గాల

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube