యూకే పార్లమెంట్‌కు నామినేట్ అయిన భారత సంతతి విద్యావేత్త  

Indian-Origin academic Prem Sikka Nominated To UK Parliament, Prem Sikka , UK Parliament, -

యూకేలో భారత సంతతి విద్యావేత్తకు అరుదైన గౌరవం లభించింది.విద్యా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంట్‌ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ చేసింది.

 Indian Origin Prem Sikka Uk Parliament Nomination

షెఫీల్డ్ యూనివర్సిటీలో సిక్కా అకౌంటింగ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.సిక్కా 1977లో అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ నుంచి చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్‌గా అర్హత సాధించారు.1982లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అకౌంటింగ్, ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.1991లో షెఫీల్డ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్‌లో పీహెచ్‌డీ చేశాడు.1995లో ఓపెన్ యూనివర్సిటీ నుంచి సాంఘిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు.1996లో ఎసెక్స్ వర్సిటీ అధ్యాపక బృందంలో చేరారు.

కాగా అకౌంటింగ్ వృత్తిని సిక్కా బహిరంగంగా విమర్శించేవాడు.ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థలను ఆడిట్ చేయడంలో, దేశీయ సంస్థలు పన్నులు ఎగ్గొట్టడానికి సహాయపడటంలో అకౌంటెంట్ల పాత్రను తప్పుబట్టేవారు.ఆడిటింగ్ వైఫల్యాలు, కార్పోరేట్ పాలన సమస్యలు, మనీలాండరింగ్, దివాలా, పన్ను ఎగవేత గురించి ది గార్డియన్ కోసం సిక్కా వ్యాసం రాశారు.

యూకే పార్లమెంట్‌కు నామినేట్ అయిన భారత సంతతి విద్యావేత్త-Telugu NRI-Telugu Tollywood Photo Image

కాగా సిక్కాతో పాటు మొత్తం 36 మందిని యూకే ప్రభుత్వం హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ చేసింది.

ప్రభుత్వం చేసిన సిఫార్సులను బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 శుక్రవారం ఆమోదించారు.ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో సిక్కాతో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సర్ ఇయాన్ బోథమ్, ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు జో జాన్సన్, స్కాటిష్ నేత రూత్ డేవిడ్సన్, మాజీ ఆర్ధిక మంత్రులు కెన్ క్లార్క్, ఫిలిప్ హమ్మండ్ తదితర ప్రముఖులు ఉన్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Prem Sikka Uk Parliament Nomination Related Telugu News,Photos/Pics,Images..