కొత్త చరిత్రకు నాంది: సింగపూర్‌ ప్రతిపక్షనేతగా బాధ్యతలు స్వీకరించిన ప్రీతం సింగ్

అగ్రరాజ్యం అమెరికా సహా వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సహా రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.కమలా హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపికైన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయ రాజకీయవేత్తల కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

 Indian Origin Pritam Singh Formally Takes Charge As First Leader Of The Oppositi-TeluguStop.com

తాజాగా సింగపూర్‌లో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు ప్రీతం సింగ్ చరిత్ర సృష్టించారు.ఆ దేశ పార్లమెంట్‌లో తొలి భారత సంతతి ప్రధాన ప్రతిపక్షనేతగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ ఏడాది జూలై 10న జరిగిన జనరల్ ఎన్నికల్లో ప్రీతంకు చెందిన వర్కర్స్ పార్టీ మొత్తం 93 సీట్లకు గాను 10 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో సింగపూర్ ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ కొత్త సెక్రటరీ జనరల్‌గా ప్రీతంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రీతం.2011 మేలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.సింగపూర్ ఈశాన్య-తూర్పు ప్రాంతం.ఐదుగురు సభ్యుల ప్రాతినిథ్య బృంద నియోజకవర్గమైన అల్జునైడ్ గ్రూప్ రెప్రజెంటేషన్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కాగా 2001 నుంచి వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న థియా ఖియాంగ్ (61) తాను మరోసారి పోటీ చేయనని ప్రకటించారు.యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు గతేడాది నవంబర్‌లోనే ఆయన వెల్లడించారు.

ఖియాంగ్ ప్రకటనతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ప్రీతం సింగ్ పేరు ముందు వరుసలో నిలిచింది.కాగా పార్లమెంట్‌లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ నేత ఇంద్రాణీ రాజ్హా కూడా భారత సంతతికి చెందిన వారే.

ఇలా అధికార, ప్రతిపక్షనేతలు ఇద్దరూ కూడా భారతదేశ మూలాలు ఉన్న వారు కావడంతో ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube