దర్యాప్తు పేరుతో మహిళలపై వేధింపులు: సింగపూర్‌లో భారత సంతతి పోలీస్ అధికారికి జైలు

తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కిన ఆడపడుచులకు అండగా నిలవాల్సింది పోయి వారి అవసరాన్ని అడ్డం పెట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసు అధికారులు ఉదంతాలు మనదేశంలో కొకొల్లలు.సింగపూర్‌లోనూ ఇదే తరహా మనస్తత్వంతో మహిళలను వేధించిన భారత సంతతి పోలీస్ అధికారి కటకటాల పాలయ్యాడు.
సింగపూర్‌ పోలీస్ ఫోర్స్‌లో పనిచేస్తున్న మహేంద్రన్ సెల్వరాజు అనే భారత సంతతి అధికారి మహిళలపై తప్పుడు కేసులు పెట్టి, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ క్రమంలో మే 1న ది కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు మహేంద్రన్‌ను అరెస్ట్ చేశారు.

 Indian-origin Police Official In Singapore Jailed For Seeking Sexual Favours Fro-TeluguStop.com

కంపెనీ యాజమాన్యం దొంగతనం కేసు పెట్టిందని ఓ మహిళకు అబద్ధం చెప్పి దర్యాప్తు పేరుతో ఆమెను కలిశాడు.
తన మాటలు పూర్తిగా నమ్మిందని భావించిన మహేంద్రన్ తన అసలు రూపం బయటపెట్టాడు.

తన కోరిక తీరిస్తే కేసు నుంచి బయటపడేస్తానని, లేనిపక్షంలో జైలుకు వెళ్లాల్సి వుంటుందని ఆమెను బెదిరించాడు.అక్కడితో ఆగకుండా ఇలాగే దర్యాప్తు పేరిట మరో మహిళపై కూడా మహేంద్రన్ వేధింపులకు పాల్పడినట్లు తేలింది.

ఈ కేసులకు సంబంధించి సింగపూర్ కోర్టు విచారణ జరిపింది.అవినీతి, లైంగిక కేసుల్లో మహేంద్రన్ దోషిగా తేలడంతో అతనికి ప్రతి కేసులో ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష సింగపూర్ డాలర్లు జరిమానా విధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube