తిరుగులేని మద్ధతు: జో బిడెన్‌కు జైకొట్టిన భారత సంతతి వైద్యుల అసోసియేషన్  

Indian-origin Physicians Endorse Joe Biden For Presidential Polls - Telugu Elections 2020, Indian-origin Physicians, , Joe Biden, Nri, Telugu Nri News

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున దూసుకెళ్తొన్న జో బిడెన్‌కు భారతీయ సమాజానికి సంబంధించి భారీ మద్ధతు లభించింది.ఇండో-అమెరికన్ కమ్యూనిటి వ్యక్తులు సభ్యులుగా ఉన్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) ఆయనకు జై కొట్టింది.
ఏఏపీఐ విక్టరీ ఫండ్ సహ వ్యవస్థాపకుడు, ఇండో-అమెరికన్ పౌరుడు శేఖర్ నరసింహన్ ఓ వార్తా పత్రికతో మాట్లాడుతూ తాము అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రాట్ పార్టీ అభ్యర్థులను కలిసినట్లు తెలిపారు.అంతకుముందే తమ ప్రాధాన్యతలు, సమస్యల గురించి ఇండో-అమెరికన్ కమ్యూనిటీతో చర్చించామని తెలిపారు.

Indian-origin Physicians Endorse Joe Biden For Presidential Polls

ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించగల అభ్యర్థికే మద్ధతు తెలపాలని సభ్యులు తనతో చెప్పినట్లు శేఖర్ వెల్లడించారు.అదే సమయంలో జో బిడెన్‌ భారత సంతతి సమాజంలో మంచి పేరున్న నేత కావడంతో పాటు 2019 మూడో త్రైమాసికంలో సుమారు 2,46,000 డాలర్ల విరాళాలను అందజేశారని నరసింహన్ గుర్తుచేశారు.

   అధ్యక్ష రేసులో ఉన్న ఆసియా-అమెరికన్ పౌరుడు ఆండ్రూ యాంగ్‌కు కూడా ఏఏపీఐ ప్రాధాన్యతను ఇచ్చిందని.అయితే జనవరి 3న అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి మేజర్ జనరల్ ఖాసీం సోలేమాని హత్య తర్వాత మధ్యప్రాచ్చంలో ఉద్రిక్తతలు పెరిగాయన్నారు.అందువల్ల ఆండ్రూకు మద్ధతుపై సభ్యులను సంప్రదించగా.ఎక్కువమంది జో బిడెన్‌ వైపే మొగ్గుచూపారని ఆయన తెలిపారు.

   జోకు మద్దతుగా ఏఏపీఐ సభ్యులు ఆన్ ది గ్రౌండ్ ర్యాలీలు, డిజిటల్ ఈవెంట్లను నిర్వహిస్తారని నరసింహన్ స్పష్టం చేశారు.అధ్యక్ష బరిలో వున్న ముగ్గురు ఏఏపీఐ సభ్యులు, ఇతరులను సైతం తాము ఎంతో గౌరవిస్తున్నామని.వచ్చే పది నెలలు ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని నరసింహన్ అన్నారు.
2015లో ప్రారంభించిన ఏఏపీఐ విక్టరీ ఫండ్ ఇండో-అమెరికన్లు, ఇతర ఆసియా-అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులు అధ్యక్ష బరిలో నిలిచేందుకు నిధుల సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది.కాగా బిడెన్ ఫర్ ప్రెసిడెంట్ ప్రచార నిర్వహకుడు గ్రెగ్ షుల్ట్జ్‌ మాట్లాడుతూ.డోనాల్డ్ ట్రంప్‌ను ఒక టైమ్ ప్రెసిడెంట్‌గా చేసే ఈ చారిత్రక వ్యవహరంలో ఏఏపీఐ విక్టరీ ఫండ్ భాగస్వామిగా ఉన్నందుకు తాము ఎంతగానో సంతోషిస్తున్నామని తెలిపారు.

తాజా వార్తలు