సీనియర్ ఉద్యోగి రాజీనామా, విమర్శలు: ప్రీతి పటేల్‌కు భారతీయ సమాజం మద్ధతు  

Indian-origin Peers, Leaders Rally Behind Uk Home Secretary Priti Patel Amid Bullying Row - Telugu Britain, , Nri, Priti Patel, Telugu Nri News, Uk, Uk Home Secretary

బ్రిటన్ రాజకీయాల్లో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారత సంతతి మహిళా నేత, ఆ దేశ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్‌‌కు భారతీయ సమాజం బాసటగా నిలిచింది.కొద్దిరోజుల క్రితం హోంశాఖలోని ఉన్నతోద్యోగి సర్ ఫిలిప్ రుత్నం అనే అధికారి ప్రీతిపై ఆరోపణలు చేస్తూ రాజీనామా చేశారు.

Indian-origin Peers, Leaders Rally Behind Uk Home Secretary Priti Patel Amid Bullying Row

దీంతో అన్ని వైపుల నుంచి ఆమెపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్‌లో భాగమైన హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోని భారతీయ సంతతి సహచరులు, వ్యాపార ప్రముఖులు, ఇతర ముఖ్య వ్యక్తులతో ఉన్న క్రాస్ సెక్టార్‌ ప్రతినిధి బృందంలోని 90 మంది ప్రీతి పటేల్‌కు మద్ధతు పలికుతూ శుక్రవారం ఓ లేఖ విడుదల చేశారు.

సీనియర్ ఉద్యోగి రాజీనామా, విమర్శలు: ప్రీతి పటేల్‌కు భారతీయ సమాజం మద్ధతు-Latest News-Telugu Tollywood Photo Image

ఆమెను ధృఢమైన, సమర్థవంతమైన నేతగా అభివర్ణించారు.ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ప్రీతీ హద్దు మీరలేదని, నిగ్రహాన్ని కోల్పోలేదని తెలిపారు.ఆమె వృత్తిపరంగా ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను ఆకాంక్షిస్తారని లేఖలో ప్రస్తావించారు.బలమైన, సమర్థురాలైన హోం కార్యదర్శిని కలిగి ఉండటం మన అదృష్టం అన్నారు.

హోం ఆఫీస్‌లో సీనియర్ సివిల్ సర్వెంట్లను ప్రశ్నించే అధికారం కలిగి ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.

అంతకుముందు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సైతం ప్రీతికి బాసటగా నిలిచారు.ఆమెపై తనకు నమ్మకం ఉందని, తనకు తెలిసి ఆమె అద్భుతమైన హోంశాఖ కార్యదర్శిగా అభివర్ణించారు.కాగా రాజీనామా చేసిన తర్వాత ఫిలిప్ రుత్నం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ… తన గురించి తప్పుగా ప్రచారం జరుగుతోందని, దీనికి కారణం ప్రీతి పటేల్ అని ఆరోపించారు.

ఆమె అర్థంలేని డిమాండ్‌లు, దురుసు ప్రవర్తనను తట్టుకోలేక తాను బలవంతంగా రాజీనామా చేస్తున్నట్లు రుత్నం చెప్పారు.ఇది రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రతిపక్ష లేబర్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఈ వ్యవహారంపై ప్రీతి పటేల్‌ పార్లమెంట్‌లో తక్షణం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian-origin Peers, Leaders Rally Behind Uk Home Secretary Priti Patel Amid Bullying Row Related Telugu News,Photos/Pics,Images..

footer-test