దక్షిణాఫ్రికా : ఇంటిలిజన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ గా భారతీయుడు...!!!

భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే మనదైన ప్రతిభా పాటవాలతో ఆయా దేశాలలో ఉన్నత స్థానాలలో కొలువుదీరుతుంటారు.ఎక్కువగా అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులు కీలక పదవులు పొందారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

 Indian-origin Officer Appointed South Africa's Intelligence Inspector-general,im-TeluguStop.com

కానీ ఏ దేశంలోనైనా సరే భారతీయుల హవా కనిపిస్తుంటుంది.తాజాగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం అక్కడ భారత సంతతికి చెందిన వ్యక్తికి అత్యంత కీలక భాద్యతలు అప్పగించింది.

గతంలో ఏ ప్రవాసుడు ఈ తరహా పదవులను పొందలేదని తెలుస్తోంది.వివరాలలోకి వెళ్తే…


ఆయన పేరు ఇంతియాజ్ అహ్మద్.

ఎన్నో ఏళ్ళ క్రితమే ఆయన కుటుంభం దక్షిణాఫ్రికా లో స్థిరపడింది.అక్కడే విద్యాభ్యాసం చేసిన అహ్మద్ ప్రభుత్వంలో ఉద్యోగం సాధించారు.

క్రమ క్రమంగా ఎదుగుతున్న ఆయన గతంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డిప్యూటి డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు.అయితే ఇంటిలిజన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ పోస్ట్ ను ప్రభుత్వం భర్తీ చేస్తున్న క్రమంలో అహ్మద్ ఈ పదవికి అప్లై చేశారు.

సుమారు

25 మంది సీనియర్ అధికారులు ఈ పోస్ట్ కోసం పోటీ పడగా వారందరినీ పక్కను నెట్టి ఇంటర్న్యూ లో ప్రతిభ కనబరిచిన అహ్మద్ ఈ పదవికి ఎంపిక అయ్యారు.నేషనల్ అసెంబ్లీ సభ్యులలో సగానికి పైగా అహ్మద్ ఎంపికకు ఒకే చెప్పారు.

అయితే చివరిగా ఆయన నియామకానికి అధ్యక్షుడు సిరిల్ ఆమోదం తెలుపాల్సి ఉంది.ఇదిలాఉంటే ఇంటిలిజన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ పదవి అత్యంత కీలకమైన పదవి, దేశ నిఘా విభాగం , మిలటరీ ఇంటిలిజన్స్ , క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇలా కీలక విభాగాలు అన్నిటిపై ఇన్స్పెక్టర్ జనరల్ కు పూర్తి అధికారాలు ఉంటాయి.

ఆయా విభాగాల అధికారులపై కూడా దర్యాప్తుకు ఆదేశించే అధికారం జనరల్ పదవికి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube