మరో భారతీయ యువతికి బిడెన్ కీలక పదవి..!!

అమెరికాలో భారతీయుల హవా ఓ రేంజ్ లో ఉంది, కీలక పదవులలో భారతీయులు కొలువుదీరుతున్నారు, అమెరికాలో భారతీయులు ఒక్కోకరిగా ఆక్రమిస్తున్నారు అంటూ బిడెన్ కొద్ది రోజల క్రితమే వ్యాఖ్యానించారు.ఎంతో సంతోషంగా ఉంది ధృడసంకల్పానికి అంటూ బిడెన్ భారతీయులను ఆకాశానికి ఎత్తేశారు.

 Indian Origin Naureen Hassan First Vp Coo Of Federal Reserve Bank Of New York-TeluguStop.com

ఈ ప్రకటన చేసి చేయగానే మరో భారతీయ మహిళను బిడెన్ మరొక అత్యున్నత పదవికి ఎంపిక చేశారు.ప్రవాస భారతీయురాలైన నౌరిన్ హాసన్ అనే మహిళకు న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ మొదటి వైస్ ప్రెసిడెంట్, అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా కీలక భాద్యతలు అప్పగించారు.

ఈ మేరకు
న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రెసిడెంట్ సిఈవో జాన్ సి విలియమ్స్ కీలక ఆదేశాలు జారీ చేశారు.ఫెడరల్ రిజర్వ్ గవర్నర్లు అందరూ ఏకపక్షంగా హాసన్ ఎంపికను ద్రువీకరిచారని ఆయన తెలిపారు.

 Indian Origin Naureen Hassan First Vp Coo Of Federal Reserve Bank Of New York-మరో భారతీయ యువతికి బిడెన్ కీలక పదవి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నెల 15వ తేదీ నుంచీ ఆమె అధికారికంగా ఈ పదవి భాద్యతలు చేపడుతారని విలియమ్స్ తెలిపారు.ఈ క్రమంలో విలియమ్స్ ఆమె పై ప్రసంసల వర్షం కురిపించారు.

నౌరిన్ హాసన్ ఎంతో ధైర్యం గల అమ్మాయని, ఆమె స్పూర్తి వంతమైన నాయకురాలి కొనియాడారు.ఆమెతో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నాని తెలిపారు.ఇదిలాఉంటే

నౌరిన్ హాసన్ కు ఫైనాన్షియల్ రంగంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది.కేరళా నుంచీ అమెరికాకు వలస వెళ్ళింది నౌరిన్ కుటుంభం.చిన్నతనం నుంచీ చదువులో చురుకుగా ఉండే నౌరిన్ నాయకత్వంలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచేదని అంటున్నారు కుటుంభ సభ్యులు. ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పట్టా పొందిన నౌరిన్ అమెరికాలో పలు కీలక రంగాలలో తన ప్రతిభను కనబరిచారు.

ఆమె అనుభవాన్ని, పని తీరును దృష్టిలో పెట్టుకున్న బిడెన్ ఆమెకు ఈ అత్యున్నత పదవి కట్టబెట్టారని తెలుస్తోంది.

#Naureen Hassan #America #Joe Biden #New York #Indians

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు