నేరం ఒప్పుకోవాల్సిందిగా చిత్రహింసలు: భారత సంతతి అధికారిపై ఆరోపణలు  

నేరం ఒప్పుకోవాల్సిందిగా ఓ వ్యక్తిని హింసించిన అభియోగంపై సింగపూర్ సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేస్తున్న భారత సంతతి అధికారి విచారణ ఎదుర్కొంటున్నారు.2017లో వుడ్ ల్యాండ్స్ చెక్ పాయింట్ వద్ద జరిపిన సోదాల సందర్భంగా డ్రగ్స్ దొరకడంతో నేరాన్ని అంగీకరించాల్సిందిగా

వెంగేదేశ్ రాజ్ నైనర్ నాగరాజన్

తనను హింసిచినట్లు మలేషియన్ జాతీయుడు శివబాలన్ కన్నియప్పన్ ఆరోపించాడు.

TeluguStop.com - Indian Origin Narcotics Officer Goes On Trial In Singapore For Assaulting A Man

దీంతో ఉన్నతాధికారులు నాగరాజన్‌ను గతేడాది అక్టోబర్ 5న సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు.శివబాలన్‌ను వెంగేదేశ్ 2017 జనవరి 2న విచారణ నిమిత్తం పిలిపించాడు.నేరాన్ని అంగీకరించమని మూడు సందర్భాల్లో మూడవ అంతస్తులో ఉన్న వుడ్ ల్యాండ్స్ చెక్ పాయింట్ సీఎన్‌బీ బ్లాక్ బీ కార్యాలయంలోని టాయిలెట్‌కు శివబాలన్‌ను పదే పదేప తీసుకెళ్లినట్లుగా ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది.ఇందుకు సంబంధించి పోలీసు అధికారులను సాక్షులుగా చేర్చింది.

వీరిలో ఒకరు వెంగేదేశ్‌పై మొదటి ఫిర్యాదును దాఖలు చేయగా, మిగిలిన ఇద్దరు కేసును దర్యాప్తు చేసిన అధికారులు.వీరితో సహా 15 మంది సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్, సీఎన్‌బీ వుడ్ ల్యాండ్స్ కార్యాలయం ఫోటోలు, వెంగేదేశ్‌ నుంచి వచ్చిన స్టేట్‌మెంట్లను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ప్రాసిక్యూషన్ భావిస్తోంది.

TeluguStop.com - నేరం ఒప్పుకోవాల్సిందిగా చిత్రహింసలు: భారత సంతతి అధికారిపై ఆరోపణలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరోవైపు శివబాలన్ సైతం డ్రగ్స్ నేరాలకు పాల్పడినట్లు కోర్టు విచారణలో తేలడంతో అతనికి 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం వుంది.కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం జనవరి 2, 2017న తెల్లవారుజామున రెయిన్ కోట్ బ్యాగ్‌లో దొరికిన డ్రగ్స్ తనవేనని ఒప్పుకునేలా శివబాలన్‌ను వెంగేదేశ్‌ తీవ్రంగా కొట్టాడు.అలాగే ఉదయం 8.35 గంటల నుంచి 8.43 గంటల మధ్య హెరాయిన్ వున్న మాదక ద్రవ్యాల విషయంలో మరోసారి కొట్టాడు.ఇక 9.28 గంటల నుంచి 9.30 గంటల మధ్య మూడోసారి దాడికి పాల్పడినట్లు తేలింది.ఈ నేరానికి గాను వెంగేదేశ్‌కు ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానాకు గురయ్యే అవకాశం వుంది.

#VengeshRaj #IndianIn ##WomenRights

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు