ఎంతకు తెగించారంటే: బెడిసికొట్టిన భారత సంతతి తల్లీకూతుళ్ల ప్లాన్.. చివరికి

సులభంగా డబ్బు సంపాదించేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నించేవారు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నారు.తోటి వ్యక్తిని మోసం చేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు.

 Indian-origin Mother, Daughter Get Jail For Insurance Fraud In America, Insuranc-TeluguStop.com

తాజాగా ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత దుకాణాన్నే తగులబెట్టిన ఇద్దరు భారత సంతతి తల్లీకూతుళ్లకు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది.కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో నివసిస్తున్న మంజిత్ సింగ్ (49), ఆమె కుమార్తె హర్పనీత్ బాత్ (27)లకు మోసపూరిత కుట్ర అభియోగంపై కెంటుకీలోని యూఎస్ జిల్లా జడ్జీ డేవిడ్ బన్నింగ్ శిక్ష ఖరారు చేశారు.

మంజిత్ సింగ్ కెంటుకీలో డిపార్ట్‌మెంటల్ స్టోర్ నిర్వహిస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో తన దుకాణాన్ని తగులబెట్టాల్సిందిగా ఓ వ్యక్తికి 5,000 డాలర్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

స్టోర్‌లో అగ్నిప్రమాదం సంభవిస్తే దానిపై వున్న ఇన్సూరెన్స్ డబ్బులు పొందవచ్చని ఆమె ఈ ప్లాన్ వేసింది.పథకంలో భాగంగా ఆ ఆజ్ఞాత వ్యక్తికి తొలుత 1,000 డాలర్లు.

మిగిలిన 4,000 డాలర్లు బీమా క్లైయిమ్ అయిన తర్వాత ఇస్తానని మంజిత్ సింగ్ వాగ్ధానం చేసింది.

ఈ పనిలో తన తల్లికి సహాయం చేయడానికి తాను కెనడా నుంచి కెంటుకీకి వెళ్లినట్లు బాత్ తన నేరాన్ని అంగీకరించింది.

ఆజ్ఞాతవ్యక్తిని కలిసిన తర్వాత అతనికి 900 డాలర్లు ఇచ్చిన బాత్, అనంతరం అతని బ్యాంక్ ఖాతా నెంబర్ తీసుకుంది.అయితే అగ్నిప్రమాదం జరగడానికి ముందే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వీరి కుట్రను అడ్డుకున్నారు.

అనంతరం వీరిపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.ఫెడరల్ లా ప్రకారం.

మంజిత్ సింగ్, బాత్ 85 శాతం జైలు శిక్షను అనుభవించాలి.ఆ తర్వాత రెండేళ్ల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉంటారు.

జైలు శిక్షతో పాటు 7,500 డాలర్ల జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube