దుబాయ్ లో భారత సంతతి చెఫ్ తొలగింపు..రీజన్ తెలిస్తే షాక్ అవుతారు

దుబాయ్ లో భారత సంతతి చెఫ్ ని తొలగించారు.చెఫ్ తొలిగిస్తే పెద్ద విశేషం ఏమిటి అనుకునేరు.

 Indian Origin Michelin Star Chef In Dubai Sacked Over Anti Islam Tweet-TeluguStop.com

ఆయన అలాంటి ఇలాంటి చెఫ్ కాదు యూఏఈ లోనే అత్యంత ఫేమస్ చెఫ్ చాలా కాస్ల్టీ చెఫ్ కూడా అయితే ఆయన కోసం ఎంతో పెద్ద ఫేమస్ హోటల్స్ అన్నీ క్యూ కడుతాయి కొట్లలో జీతాలు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయవు.అలాంటి చెఫ్ ని దుబాయ్ లోని ఒక హోటల్ తొలగించింది.ఇంతకీ ఆయన్ని తప్పించడానికి కారణం అయిన విషయం ఏమిటంటే

ఆ చెఫ్ కేవలం ఒక ట్విట్టర్ ట్వీట్.ద్వారా తొలగించబడ్డాడు ఆశ్చర్య పోతున్నారా అవును ఇది నిజమే ఎంతపెద్ద ఫేమస్ చెఫ్ తన ట్వీట్ తో ఉద్యోగం పోగొట్టుకోవడం తో ఆయన కూడా షాక్ తిన్నాడు ఇక అసలు వివరాలలోకి వెళ్తే.భారత సంతతికి చెందిన అతుల్ కొచ్చార్ అనే చెఫ్ తన ట్వీట్ లో ముస్లిం , హిందూ అనే పదాలని వాడటం కారణంగా తొలగించబడ్డాడు…అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా క్వాంటికో అనే టీవీ సిరీస్‌తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మొదటి ఎపిసోడ్ హిట్ కావడంతో రెండో సిరీస్‌లోనూ ప్రియాంక నటించింది…అయితే ఫస్ట్ ఎపిసోడ్‌కు ఇండియా నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది.అయితే రెండో ఎపిసోడ్‌లో హిందువులను టెర్రరిస్ట్‌లుగా చూపించడం పట్ల దేశంలోని కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దాంతో స్పందించిన ప్రియాంక నేను భారతీయురాలిని అయినందుకు గర్వపడతాను అని చెప్పింది.

‘‘2000 ఏళ్ళ నుంచి ఇస్లాం వారిచే భయబ్రాంతులకు గురవుతున్న హిందువుల మనోభావాలను ప్రియాంక గౌరవించకపోవడం బాధాకరం.మీ పట్ల చింతిస్తున్నాను అంటూ ప్రియాంక కి రెప్లై ఇచ్చాడు దాంతో ఆ ట్వీట్ అతడిని చిక్కుల్లో పడేసింది.ఇస్లాం కి వ్యతిరేకంగా ఆయన చేసిన కామెంట్ ఉండటంతో జేడబ్ల్యూ మారియోట్ మర్కూస్ హోటల్ యాజమాన్యం ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.

ఈ విషయమై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube