కరోనా: యూకేలో తెల్లవారి కంటే భారత సంతతికే రిస్క్ ఎక్కువట

ప్రాంతాలు, దేశాలు, పట్టణాలు, జాతులు, సమూహాలు అనే వ్యత్యాసం లేకుండా కరోనా వ్యాప్తి చెందుతోంది.ఈ మహమ్మారి సోకిన విధానం కూడా విభిన్నంగా ఉంటోంది.

 Indian-origin Men, Women Face Higher Death Risk From Covid-19 In England  Indian-TeluguStop.com

వ్యాధి నిరోధక శక్తి, ఆరోగ్యం, వయసు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటిపై రిస్క్ శాతం ఆధారపడి వుంటోంది.తాజాగా ఇంగ్లాండ్, వేల్స్‌లో జరిగిన ఒక అధ్యయనం సరికొత్త వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.ఇక్కడ శ్వేత జాతీయులతో పోలిస్తే.50 నుంచి 70 శాతం అధికంగా భారత సంతతి ప్రజలే కరోనా కారణంగా మరణించే అవకాశాలున్నాయట.ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) ఇందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం విడుదల చేసింది.నివాస పరిస్థితులు, ఉద్యోగ స్వభావమే ఈ అంతరానికి కారణమని ఆ సంస్థ విశ్లేషించింది.

దక్షిణాసియా, నల్ల జాతుల్లో జూలై 28 వరకు చోటు చేసుకున్న మరణాలను తాము లెక్కలోకి తీసుకున్నామని ఓఎన్ఎస్ తెలిపింది.శ్వేతజాతీయులతో పోలిస్తే.

వీరిలో మరణించే అవకాశం అధికంగా ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. గతంలో మే 15 వరకు వున్న వివరాలను విశ్లేషించామని.

అప్పడు ఎలాంటి ఫలితాలు వచ్చాయో, ఇప్పుడూ అదే ఫలితాలు వచ్చాయని గణాంక సంస్థ వివరించింది.అన్ని జాతుల్లోనూ ఆడవారి కంటే మగవారికే ముప్పు పొంచి వుందని, అలాగే శ్వేతజాతీయుల్లో చైనా మినహా మిగిలిన అన్ని జాతుల్లోనూ మరణించే ప్రమాదం తక్కువగా వుందని చెప్పింది.

దక్షిణాసియాకు సంబంధించి ఓఎన్ఎస్ గతంలో జరిపిన అధ్యయనంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతులను కలిపి విశ్లేషించింది.ఈ రెండు జాతులను వేరుగా చూసిన తర్వాత.బంగ్లాదేశ్ జాతి నేపథ్యం వున్న మగవారికి, పాకిస్తానీయులతో పోలీస్తే రిస్క్ శాతం ఎక్కువగా వుందని కనుగొన్నారు.మరణాల రేటులో డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధులు, గుండె వైఫల్యం వంటి వాటిని కూడా పరిగణనలోనికి తీసుకున్నారు.

Telugu Black Peoples, Coronavirus, Indian Origin-Telugu NRI

కాగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ బ్రిటన్‌లో భయాందోళనలు రేపుతోంది. రాజధాని లండన్ లో మరోసారి లాక్ డౌన్ అమలు కానుంది.అక్టోబర్ 16 అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమలు కానున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది.

ఈ నేపధ్యంలో లండన్‌లో మరోసారి లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రధాని నిర్ణయించారు.లండన్ లాక్డౌన్ రూల్స్ ప్రకారం లండన్‌ ప్రజలు ఇతరుల ఇళ్లకు వెళ్లడం లేదా ఇతరుల్ని తమ ఇంటికి ఆహ్వానించడం పూర్తిగా నిషేధం.

ఇండోర్, అవుడ్ డోర్స్‌లో గ్రూప్ సమావేశాలు జరపకూడదు.అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు.

అది కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కాకుండా కాలినడకన లేదా సైకిల్‌పై మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube