బ్రిటన్‌లో సత్తా చాటిన భారత సంతతి వ్యాపారవేత్త.. మేయర్‌గా ఎన్నిక, వరుసగా రెండోసారి..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు ఆయా దేశాలను శాసించే స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులుగా కీలక హోదాల్లో వున్నారు.

 Indian-origin Man Sunil Chopra Elected As Mayor In Uk For Second Time , Sunil Chopra, Britain‌, Mayor Of The Southwark Borough Of London, Uk Labor Party, London Bridge, West Bermondsey, National Students Union Of India-TeluguStop.com

ఇక పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయులు నిర్ణయాత్మక శక్తిగా వున్న సంగతి తెలిసిందే.తాజాగా బ్రిటన్‌Britain‌లోని ఓ నగరానికి మేయర్‌గా భారతీయుడు ఎన్నికయ్యాడు.

అది కూడా వరుసగా రెండోసారి.

 Indian-Origin Man Sunil Chopra Elected As Mayor In UK For Second Time , Sunil Chopra, Britain‌, Mayor Of The Southwark Borough Of London, UK Labor Party, London Bridge, West Bermondsey, National Students Union Of India-బ్రిటన్‌లో సత్తా చాటిన భారత సంతతి వ్యాపారవేత్త.. మేయర్‌గా ఎన్నిక, వరుసగా రెండోసారి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివరాల్లోకి వెళితే… లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ మేయర్‌గా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సునీల్ చోప్రా రెండోసారి ఎన్నికయ్యారు.

అనంతరం సెంట్రల్ లండన్‌లోని సౌత్ వార్క్ కేథడ్రల్, మాంటేగ్ క్లోజ్‌లో శనివారం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.సునీల్ చోప్రా 2014-15లో లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు మేయర్‌గా పనిచేశారు.

అంతకుముందు 2013-14లో డిప్యూటీ మేయర్‌గా విధులు నిర్వర్తించారు.అంతేకాకుండా బరో మేయర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగానూ సునీల్ చోప్రా రికార్డుల్లోకెక్కారు.

యూకే లేబర్ పార్టీ… చోప్రా నాయకత్వంలో లండన్ బ్రిడ్జ్, వెస్ట్ బెర్మాండ్సే స్థానాల్లో లిబరల్ డెమోక్రాట్‌లపై విజయం సాధించింది.లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ కౌన్సిల్‌లో కేవలం 2 శాతం మంది మాత్రమే భారత సంతతి ప్రజలు వున్నందున సునీల్ చోప్రా విజయం ప్రాధాన్యత సంతరించుకుంది.

2010లో యూకే రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన.2014లో తొలిసారి లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు మేయర్‌గా ఎన్నికయ్యారు.అలాగే మూడు సార్లు డిప్యూటీ మేయర్‌గా కూడా పనిచేశారు.అంతకుముందు భారత్‌లో వున్నప్పుడు కూడా సునీల్ చోప్రా 1970వ దశకంలో ఢిల్లీ రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించారు.1972లో ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ ఆఫ్ వోకేషనల్ స్టడీస్‌కి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు.ఎల్ఎల్‌బీ చదువుతున్నప్పుడు 1973-74లో ఢిల్లీ యూనివర్సిటీలో సుప్రీం కౌన్సిలర్‌గా పనిచేశారు.

తర్వాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

1979లో యూకే వలస వెళ్లిన సునీల్ చోప్రా ఒక రిటైల్ ఎంటర్‌ప్రైజ్ దుకాణాన్ని ప్రారంభించారు.అనతికాలంలోనే అది హోల్‌సేల్ వ్యాపారంగా ఎదిగింది.వ్యాపారంలో బిజీగా వున్నప్పటీకి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించేవారు.

ఆ ప్రాంతంలో భారతీయ కమ్యూనిటీ కోసం ఆయన సౌత్‌వార్క్ హిందూ సెంటర్ అనే సంస్థను స్థాపించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube