సహాయం చేసినట్లు చేసి, అత్యాచారం: అమెరికాలో భారతీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష

అత్యాచారానికి పాల్పడిన నేరంపై భారత సంతతికి చెందిన వ్యక్తికి అమెరికా కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.పెన్సిల్వేనియాలో నివసిస్తున్న 59 ఏళ్ల అశోక్ సింగ్ అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించినట్లు క్వీన్స్ జిల్లా న్యాయవాది మెలిండా కాట్జ్ సోమవారం తెలిపారు.

 Indian Origin Man Sentenced To 7 Years In Prison-TeluguStop.com

అశోక్ సింగ్ 2015 డిసెంబర్‌లో ఒక మహిళకు అపార్ట్‌మెంట్‌ బేస్‌మెంట్‌లో ఉండటానికి సహాయం చేసి, అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

సదరు మహిళ అశోక్‌ను క్వీన్స్‌లోని ఒక ఆలయంలో కలుసుకుంది.

ఆ సమయంలో తాను ఉండటానికి ఏదైనా స్థలం చూపించమని ఆమె అడగటంతో సరేనన్నాడు.ఈ క్రమంలో ఒకరికొకరు ఫోన్ నెంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు.

నాలుగు రోజుల తర్వాత సింగ్ ఆమెకు ఫోన్ చేసి ఒక అపార్ట్‌మెంట్ దొరికిందని, వెంటనే షిఫ్ట్ అవ్వాలని చెప్పాడు.ఆమె అద్దె ఇంట్లోకి వెళ్లేందుకు అశోక్ సాయం చేశాడు.

ఆ తర్వాత వైన్, ఆహారం కోసం స్థానిక కిరాణా స్టోర్‌కు వెళ్లి తిరిగి ఆమె దగ్గరకు వచ్చాడు.అశోక్ బాధితురాలికి వైన్ ఇవ్వగా, ఆమె తిరస్కరించింది.దీంతో ఆగ్రహించిన అతను ఆమెను మంచంపైకి విసిరి అత్యాచారం చేశాడు.ఆ తర్వాత అతను నిద్రలోకి జారుకోవడంతో బాధితురాలు అపార్ట్‌మెంట్ నుంచి పరిగెత్తుకొచ్చి ఒక స్నేహితుడికి విషయం చెప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఆమె చికిత్స పొందుతుండగా అశోక్ బాధితురాలికి ఓ వాయిస్ మేసేజ్ పంపాడు.

జరిగిన దానికి తనను క్షమించాలని, అనుమతి లేకుండా మరోసారి ఇలా ప్రవర్తించనని చెప్పాడు.సోమవారం తీర్పు సందర్భంగా క్వీన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గియా మోరిస్ అశోక్ సింగ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించడారు.

శిక్ష తర్వాత ఐదేళ్లపాటు పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని, దీనితో పాటుగా లైంగిక నేరస్థుడిగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube