బెలారస్ యువతితో వివాహం.. భారత సంతతి యువకుడికి ఆ దేశ ప్రభుత్వం నుంచి నజరానా..!!

బెలారస్‌ యువతిని పెళ్లాడిన భారత సంతతి యువకుడికి అక్కడి ప్రభుత్వం నజరానా అందజేసింది.వివరాల్లోకి వెళితే.

 Indian Origin Man Receives Rs 1 Lakh 28 Thousand From Government Of Belarus Afte-TeluguStop.com

ముంబైకి చెందిన మిథిలేష్ అనే ట్రావెల్ బ్లాగర్.బెలారస్‌కు చెందిన అమ్మాయి లిసాను పెళ్లాడాడు.

ఇటీవల అతని భార్య లిసా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది .దీనికి సంబంధించిన వివరాలను మిథిలేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్నాడు.పిల్లల పెంపకం కోసం బెలారస్ ప్రభుత్వం నుంచి ఈ దంపతులకు రూ.లక్షా 28 వేలు అందింది.అంతేకాదు.మూడేళ్ల పాటు ప్రతి నెలా రూ.18,000 చొప్పున అందుకుంటాడు.ఈ మొత్తం నేరుగా వారి ఖాతాకు బదిలీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం.

ఈ అవకాశం బెలారస్‌లో నివసించే వారికి మాత్రమే.

Telugu Baby, Belarus, Indian Origin, Liza, Mithilesh-Telugu NRI

తన భార్యకు సాధారణ ప్రసవం జరిగిందని, పుట్టినప్పుడు తమ బిడ్డ 4 కిలోల బరువు వుందని మిథిలేష్ చెప్పాడు.ఇదే సమయంలో మిథిలేష్ తన ప్రేమకథను కూడా పంచుకున్నాడు.బెలారస్‌లోని తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో లిసాను మొదటిసారి కలుసుకున్నట్లు తెలిపాడు.

భాష తెలియకపోవడంతో తొలుత ట్రాన్స్‌లేటర్ ద్వారా ఇద్దరి భావాలను వ్యక్తపరుచుకున్నారు.అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారి.

గతేడాది మార్చి 25న ఇరు కుటుంబాల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు.ఇక మిథిలేష్ యూట్యూబ్ ఛానెల్‌ (Mithilesh Backpacker)కు 9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వున్నారు.

ఇతను ప్రతిరోజూ తన దినచర్యకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ వుంటాడు.

Telugu Baby, Belarus, Indian Origin, Liza, Mithilesh-Telugu NRI

కాగాబెలారస్ హెల్త్‌కేర్ సిస్టమ్ తల్లులు, పిల్లలకు వైద్య సహాయం అందించడంలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో , పరిచయం చేయడంలో అత్యుత్తమంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రసూతులకు సంబంధించి ఈ దేశం ప్రపంచంలోనే 25వ ర్యాంక్‌లో వుంది.అలాగే ప్రినేటల్ కేర్, బర్త్ ఆర్గనైజేషన్ పరంగా బెలారస్ టాప్ 50 దేశాలలో చోటు దక్కించుకుంది.బెలారస్‌లో శిశుమరణాల రేటు ప్రతి వెయ్యి మందికి 2.5గా వుంది.ఇది ఐరోపాలో 3.69గా వుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube