కంప్యూటర్‌ను కెలికాడు... భారతీయుడి చేష్టలతో సిస్కో నెట్‌వర్క్‌కు భారీ నష్టం

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కంప్యూటర్‌ను ఉద్దేశ్యపూర్వకంగా యాక్సెస్ చేయడం ద్వారా కంపెనీకి భారీ నష్టాలను మిగిల్చినట్లు భారత సంతతి వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు.సుదీశ్ కసాబా రమేశ్ అనే 30 ఏళ్ల భారత సంతతి వ్యక్తిపై అనుమతి లేకుండా రక్షిత కంప్యూటర్‌ను ఉద్దేశ్యపూర్వకంగా యాక్సెస్ చేసినందుకు గాను గత నెలలో అభియోగాలు నమోదు చేశారు.

 Indian-origin Man Pleads Guilty To Damaging Cisco's Network In America,pleaded G-TeluguStop.com

దీనిలో భాగంగా కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ ఫెడరల్ కోర్టులో సుదీశ్ తన నేరాన్ని అంగీకరించినట్లు యూఎస్ అటార్నీ డేవిడ్ అండర్సన్ వెల్లడించారు.

పిటిషన్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం.

రమేశ్ 2018 సెప్టెంబర్ 24న సిస్కో సంస్థ అనుమతి లేకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్ హోస్ట్ చేస్తున్న సిస్కో సిస్టమ్స్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను యాక్సెస్ చేసినట్లు అంగీకరించాడు.అయితే రమేశ్ 2018 ఏప్రిల్‌లోనే సిస్కో నుంచి తప్పుకున్నాడు.

కంప్యూటర్‌ను యాక్సెస్ చేసిన తర్వాత ఓ కోడ్‌ను అందులో ఎంటర్ చేశాడు.దీని ఫలితంగా ఐటీ కంపెనీ అప్లికేషన్ నుంచి 456 వర్చువల్ మిషన్లు తొలగించబడ్డాయి.

వీడియో సమావేశాలు, వీడియో సందేశం, ఫైల్ షేరింగ్‌తో పాటు ఇతర సహకారాలను ఈ అప్లికేషన్‌ అందజేస్తుంది.

Telugu Cisco, Indianorigin, Jail, Pleaded-

రమేశ్ ఈ కోడ్‌ దానిలో రన్ చేసిన తర్వాత రెండు వారాల పాటు 16,000 ఖాతాలు మూసివేయబడ్డాయి.అలాగే ఈ అప్లికేషన్‌‌ను పునరుద్దరించడానికి 14,00,000 డాలర్లు… వినియోగదారులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 10,00,000 డాలర్లను సిస్కో సంస్థ ఖర్చు చేయాల్సి వచ్చింది.కాగా ఈ కేసులో రమేశ్ 50 వేల డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యాడు.

అతనికి న్యాయస్థానం డిసెంబర్‌లో శిక్షను ఖరారు చేయనుంది.ఈ నేరానికి గాను రమేశ్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube