యూఎస్: అంతర్జాతీయ కుంభకోణంలో దోషిగా తేలిన భారతీయుడు, త్వరలోనే జైలుశిక్ష

ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నగదు బదిలీ వ్యాపారాన్ని నిర్వహించడంతో పాటు ఓ టెక్నికల్ సపోర్ట్ కంపెనీతో కలిసి కుంభకోణంలో పాలుపంచుకున్నట్లు అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అంగీకరించాడు.ఈ కుంభకోణంలో వచ్చిన డబ్బును అతను భారత్‌లోని స్కీమ్ ఆపరేటర్లకు సైతం ట్రాన్స్‌ఫర్ చేసినట్లు అతను తెలిపాడు.

 Indian-origin Man Pleads Guilty To Operating Unlicensed Money Transfer Biz, Oper-TeluguStop.com

కాలిఫోర్నియాలోని నెవార్క్‌కు చెందిన దాపిందర్‌జిత్ సింగ్ గత వారం యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ జడ్జి పెర్సీ ఆండర్సన్ ముందు విచారణకు హాజరయ్యాడు.ఈ కేసులో దోషిగా తేలిన అతనికి కోర్టు నవంబర్ 2న శిక్ష ఖరారు చేయనుంది.

తన యాజమాన్యంలో ప్రజలకు సాంకేతిక సహాయ సేవలను అందిస్తున్న ఆల్ఫా టెక్నాలజీస్‌ వుందని సింగ్ అంగీకరించాడు.కుంభకోణంలో భాగంగా బాధితుల నుంచి నేరస్తులకు ఆల్ఫా ద్వారానే నగదు బదిలీ జరిగింది.

భారతదేశానికి చెందిన కాల్ సెంటర్ ఓ పథకం ప్రకారం మీ కంప్యూటర్‌పై వైరస్ దాడి చేసిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను ఆల్ఫా టెక్నాలజీస్‌కి డబ్బు పంపమని కోరింది.ఆ విధంగా వచ్చిన డబ్బును సింగ్‌ భారత్‌లో ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారికి పంపేవాడు.

దీనిపై యునైటెడ్ స్టేట్స్ అటార్నీ నిక్ హన్నా మాట్లాడుతూ.ఈ అంతర్జాతీయ కుట్ర వెనుక వున్న నేరస్థులకు సింగ్ ఒక మాధ్యమంగా ఉపయోగపడ్డాడని మండిపడ్డారు.

కేసు విచారణలో భాగంగా తాను 2016 నుంచి 2018 ఫిబ్రవరి వరకు భారతదేశానికి చెందిన స్కీమ్ ఆపరేటర్లతో కలిసి పనిచేశానని దాపిందర్‌జిత్ అంగీకరించాడు.ఆల్ఫా టెక్నాలజీస్‌ను కార్పోరేట్ సంస్థగా తెరవడంతో పాటు బాధితులు పంపిన చెల్లింపులను స్వీకరించడానికి పోస్టాఫీసు పెట్టేలను సింగ్ నిర్వహించాడు.

కేసు విచారణలో భాగంగా మరో ముగ్గురు వ్యక్తులపై అభియోగాలు మోపారు.ఈ కుట్రకు సంబంధించి 2019లో భారత జాతీయులు అమన్ మొహందిరట్ట, అమన్ ఖైరాపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ కుంభకోణంలో పేమెంట్ గేట్‌వేగా సాయం చేసేందుకు గాను మెహందీరట్టా, ఖైరాలు కాలిఫోర్నియా నివాసి పార్మజిత్ బ్రార్‌ను నియమించారు.వీరి కుట్రలో చాలా మంది బాధితులు వందలు, వేల డాలర్లను కోల్పోయారు.

ఇందులో వృద్ధులు సైతం ఉన్నారు.ఈ కేసుకు సంబంధించి 2019లో బ్రార్ నేరాన్ని అంగీకరించగా, వచ్చే నెలలో కోర్టు శిక్ష విధించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube