తల్లి, సవతి తండ్రి దారుణహత్య: యూకేలో భారత సంతతి యువకుడికి జీవితఖైదు

తల్లిని, సవతి తండ్రిని దారుణంగా పొడిచి చంపిన భారత సంతతి యువకుడికి యూకే కోర్టు జీవితఖైదు విధించింది.చానా అనే 26 ఏళ్ల యువకుడు ఈ ఏడాది ఫిబ్రవరి 25న వెస్ట్ మిడ్లాండ్స్‌లోని ఓల్డ్‌బరీలో తన తల్లి జస్బీర్ కౌర్ (52), సవతి తండ్రి రూపీందర్ సింగ్ బస్సన్ (51)ను కత్తితో దారుణంగా హత్య చేశాడు.

 Indian Origin Man Gets Life Term For Killing Mother, Step-father In Uk, Uk, Indi-TeluguStop.com

ఇద్దరిని చంపిన తర్వాత.నిందితుడు ఇంటిలో వున్న నగదును దొంగిలించి యూకే నుంచి పారిపోవడానికి టికెట్ కొన్నాడు.

అయితే ఈలోపే పోలీసులు చానాను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం స్మెత్‌విక్‌లోని నిందితుడి ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో సవితి తండ్రి బస్సాన్ కారు కీ, ప్రయాణ వివరాలతో కూడిన పాస్‌పోర్ట్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును తొమ్మిది రోజుల పాటు విచారించిన బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టు చానాను దోషిగా నిర్థారించింది.నీ తల్లిపై నీవు చేసిన ఆరోపణలు అబద్ధమని.అవి జ్యూరీ వద్ద సానుభూతిని పొందటానికి చేసిన వ్యాఖ్యలని న్యాయమూర్తి మార్క్ వాల్ తీర్పు సందర్భంగా అన్నారు.

Telugu Indianorigin, Indian Origin, Mother Step, Step Uk-

చానా తన కుటుంబం పట్ల సొంత ఇంటిలోనే నీచమైన నేరానికి పాల్పడ్డాడని డిటెక్టివ్ ఇన్స్‌పెక్ట్ హన్నా వైట్‌హౌస్ అన్నారు.తమ దర్యాప్తులో చానాకు గతంలోనే తల్లిని చంపే ఉద్దేశం ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు.అయితే అతనికి ఇంతటి దుర్మార్గమైన ఆలోచనకు కారణం ఏంటనేది మాత్రం అంతు చిక్కడం లేదని వైట్‌హౌస్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై చానా సోదరి కిరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అతను తన తల్లిదండ్రుల ప్రాణాలను తీయడమే కాకుండా, తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో కోర్టులో వారి పరువు తీసే ప్రయత్నం చేశాడని ఆమె మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube